AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సఫారీల సంచలనం.. పట్టుమని 10 ఓవర్లు సరిగ్గా ఆడని ఆఫ్ఘన్.. ఎంతకు ఆలౌట్ అయిందంటే.?

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌కు చేరుకొని ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఈ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘన్ కథ అడ్డం తిరిగింది. అసలు ఈ జట్టేనా.. ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు.. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్‌లో..

సఫారీల సంచలనం.. పట్టుమని 10 ఓవర్లు సరిగ్గా ఆడని ఆఫ్ఘన్.. ఎంతకు ఆలౌట్ అయిందంటే.?
Sa Vs Afg
Ravi Kiran
|

Updated on: Jun 27, 2024 | 7:53 AM

Share

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌కు చేరుకొని ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించింది. ఈ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘన్ కథ అడ్డం తిరిగింది. అసలు ఈ జట్టేనా.. ఆస్ట్రేలియాను ఓడించడంతో పాటు.. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ చతికిలబడింది. సఫారీ జట్టు పేస్ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. పట్టుమని 10 ఓవర్లైన సరిగ్గా ఆడలేకపోయింది. జాన్సన్, రబాడ, నోర్తెజ్ పేస్ త్రయానికి ఆఫ్ఘనిస్తాన్ కేవలం 39 బంతుల్లోనే ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్లు బరిలోకి దిగడంతో.. లోయర్ ఆర్డర్‌ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. అయితే తొలి ఓవర్‌లోనే దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ ఆఫ్ఘన్ జట్టుకు జలక్ ఇచ్చాడు. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించాడు. ఇక ఆ తర్వాత ఎక్కువ సమయంలో తీసుకోకుండానే మరో ఓవర్‌లో జాన్సన్ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గుల్బాదిన్ నైబ్‌ను అవుట్ చేశాడు. అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ పతనం మొదలైంది. మరుసటి ఓవర్‌లో కగిసో రబాడ వరుసగా రెండు వికెట్లు.. నోర్తెజ్‌ మరో ఒకటి.. తీయడంతో పవర్‌ప్లేలో ఆఫ్ఘనిస్తాన్‌ కేవలం 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇలా మొత్తం 11.5 ఓవర్లకు కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్, షమ్సి చెరో 3 వికెట్లు పడగొట్టగా.. నోర్తెజ్, రబాడ రెండేసి వికెట్లు తీశారు. కాగా, లక్ష్యం ఎలాగో తక్కువే కాబట్టి.. చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా ఐసీసీ మెగా ఈవెంట్ ఫైనల్‌కి చేరుకోనుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో