SA vs AUS: వన్డే క్రికెట్‌లో షాకింగ్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. స్పెషల్ జాబితాలో చోటు.. లిస్టులో ఎవరున్నారంటే?
Temba Bavuma Record: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ODIలో టెంబా బావుమా నిస్సందేహంగా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే అతను తన జట్టును విజయపథంలో నడిపించడంలో విజయం సాధించలేకపోయాడు. మార్నస్ లాబుషాగ్నే ధాటికి ఆస్ట్రేలియా 40.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, బావుమ సెంచరీ చేసిన తీరు, అతని పోరాట ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు.

Temba Bavuma Record: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సారథి టెంబా బావుమా షాకింగ్ రికార్డ్ నెలకొల్పాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే కెరీర్‌లో మరపురాని ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్‌లో స్పెషల్ ఖాతాలో చేరాడు. ఆస్ట్రేలియా బలమైన బౌలింగ్ దాడికి ఎదురు నిల్చుని చివరిదాకా పోరాడాడు. మిగతా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్న తరుణంలో బావుమా ఒక ఎండ్‌లో నిల్చుని సెంచరీ చేసి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. టెంబా బావుమా 142 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 114 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో ప్రోటీస్ జట్టు 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది.
ఈ సెంచరీతో టెంబా బావుమా తన పేరిట ఓ షాకింగ్ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి నాటౌట్‌గా తిరిగి వచ్చిన 13వ ఆటగాడిగా టెంబా బావుమా నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో దక్షిణాఫ్రికా ప్లేయర్‌గా బావుమా నిలిచాడు. ఇంతకు ముందు హెర్షెల్ గిబ్స్ కూడా ఈ ఫీట్ సాధించాడు.
సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌గా హెర్షెల్ గిబ్స్ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, చివరికి నాటౌట్‌గా వెనుదిరిగాడు. మార్చి 2000లో షార్జాలో పాకిస్థాన్‌పై గిబ్స్ ఈ ఘనత సాధించాడు. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు 101 పరుగులకే కుప్పకూలగా, ఓపెనింగ్‌కు వచ్చిన గిబ్స్ 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరపురాని ఇన్నింగ్స్ ఆడిన సౌతాఫ్రికా సారథి..
CHANGE OF INNINGS
The Proteas innings comes to an end.©️aptain Temba Bavuma led the way with 114 runs off 142 balls while Marco Jansen put in a steady 32 🏏
🇿🇦 #Proteas 222 after 49 overs
🗒 Ball by ball https://t.co/eKTzCy1xaU📺 SuperSport Grandstand 201#SAvAUS… pic.twitter.com/VcTnMrIiaA
— Proteas Men (@ProteasMenCSA) September 7, 2023
అయితే, ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా వెనుదిరిగిన ప్రపంచంలోనే మూడో కెప్టెన్‌గా టెంబా బావుమా నిలిచాడు. గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్లు ఉపుల్ తరంగ, దిముత్ కరుణరత్నే ఈ ఘనత సాధించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ODIలో టెంబా బావుమా నిస్సందేహంగా అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే అతను తన జట్టును విజయపథంలో నడిపించడంలో విజయం సాధించలేకపోయాడు. మార్నస్ లాబుషాగ్నే ధాటికి ఆస్ట్రేలియా 40.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా, బావుమ సెంచరీ చేసిన తీరు, అతని పోరాట ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు.
ఇరుజట్లు ప్లేయింగ్ 11..
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడి.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, జోష్ హాజిల్ వుడ్, ఆడమ్ జంపా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








