Sourav Ganguly: ‘కోహ్లీ, రోహిత్‌లను అతనే హ్యాండిల్ చేయగలడు’.. టీమిండియా కోచ్ పదవిపై గంగూలీ మరో ట్విస్ట్

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. అదే సమయంలో బీసీసీఐ మాత్రం టీమ్‌ ఇండియా కొత్త ప్రధాన కోచ్‌ కోసం వెతుకుతోంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను గాడిలో పెట్టగల మంచి కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది.

Sourav Ganguly: ‘కోహ్లీ, రోహిత్‌లను అతనే  హ్యాండిల్ చేయగలడు’.. టీమిండియా కోచ్ పదవిపై గంగూలీ మరో ట్విస్ట్
Sourav Ganguly

Updated on: Jun 01, 2024 | 6:44 PM

అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తోంది. అదే సమయంలో బీసీసీఐ మాత్రం టీమ్‌ ఇండియా కొత్త ప్రధాన కోచ్‌ కోసం వెతుకుతోంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను గాడిలో పెట్టగల మంచి కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది. భారత మాజీ దిగ్గజం గౌతమ్‌ గంభీర్‌ పేరు టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యే జాబితాలో ముందు వరుసలో ఉంది. టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎవరు నియమిస్తారనే దానిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే టీమ్ ఇండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గంభీర్‌తో కోచ్‌ అయ్యే విషయమై బీసీసీఐ చర్చలు జరిపినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ చేస్తోన్న ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. టీమిండియా కోచ్ కావడానికి గౌతమ్ అత్యుత్తమ అభ్యర్థి అని తాజాగా గంగూలీ తెలిపాడు. ‘ఫ్రాంచైజీకి టీమ్ మెంటార్‌గా ఉండడానికి, అత్యున్నత స్థాయి అంతర్జాతీయ జట్టుకు కోచింగ్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. గంభీర్‌కు ఇవన్నీ బాగా తెలుసు. విరాట్, రోహిత్ వంటి ఆటగాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. గంభీర టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్నా.. జట్టుకు బాగా సరిపోతాడు’ గంగూలీ వెల్లడించాడు

కాగా ఇదే సౌరవ్ గంగూలీ కొన్ని రోజుల క్రితం గంభీర్ కోచ్ కావడంపై ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశాడు. అందులో ‘ఒక ఆటగాడి జీవితంలో కోచ్‌ పదవి అత్యంత కీలకమైంది. మార్గదర్శిగా, కనికరం లేని శిక్షణతో మైదానంలో అత్యుత్తమ ప్లేయర్‌గా మార్చాల్సిన బాధ్యత ఉంటుంది. వ్యక్తిత్వపరంగానూ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కోచ్‌ పదవి కోసం ఎంపిక చేసేటప్పుడు కాస్త తెలివిని ప్రదర్శించాలి’ అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

 

 

 

గంగూలీ ట్వీట్..

ఈ పోస్ట్‌ని చూసిన అభిమానులు గౌతమ్ గంభీర్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా రావడం గంగూలీకి ఇష్టం లేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అదే గంగూలీ టీమిండియా కోచ్ గా గంభీరే సరైనోడు అని చెప్పి మరోసారి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం గంగూలీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..