AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లార్డ్స్ టెస్ట్‌లో ఉద్రిక్తత.. దీప్తిపై నోరుపారేసుకున్న ఇంగ్లీష్ ప్లేయర్.. అసలేం జరిగిందంటే?

Sophie Ecclestone vs Deepti Sharma Fight: మైదానంలో ఎంతటి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, ఆటను ఆటలాగే చూడాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనల పరిధిలోనే దీప్తి శర్మ వ్యవహరించినప్పటికీ, సహచర ఆటగాళ్ల మధ్య ఇటువంటి దూషణలు క్రికెట్ స్ఫూర్తికి మంచిది కాదు. ప్రస్తుతం టీమిండియా ఈ మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించడానికి అత్యంత సమీపంలో ఉండటం అభిమానులకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది.

Video: లార్డ్స్ టెస్ట్‌లో ఉద్రిక్తత.. దీప్తిపై నోరుపారేసుకున్న ఇంగ్లీష్ ప్లేయర్.. అసలేం జరిగిందంటే?
Sophie Ecclestone Vs Deepti Sharma Fight
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 12:02 PM

Share

Sophie Ecclestone vs Deepti Sharma Fight: లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మూడో రోజు ఆటలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, ఇంగ్లాండ్ క్రీడాకారిణి సోఫీ ఎకిల్‌స్టోన్ మధ్య చోటుచేసుకున్న ఒక వివాదాస్పద ఘటన మైదానాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. రనౌట్ చేసే ప్రయత్నంలో ఇరు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది.

మైదానంలో ఏం జరిగింది..?

భారత మహిళల జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్‌తో కలిసి సోఫీ ఎకిల్‌స్టోన్ క్రీజులో పోరాడుతోంది. ఇన్నింగ్స్ 40వ ఓవర్ చివరి బంతి వేయడానికి దీప్తి శర్మ సిద్ధమైంది. అయితే, బౌలర్ బంతిని విడవక ముందే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సోఫీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లడాన్ని దీప్తి గమనించింది. వెంటనే తన రన్నింగ్‌ను ఆపి, వెనక్కి తిరిగి సోఫీని రనౌట్ (మన్కడింగ్) చేయడానికి ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: అన్నీ గుండు సున్నాలే.. టీమిండియాను సర్వ నాశనం చేసిన ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోతది..!

దీప్తి వెనక్కి తిరగడం చూసిన సోఫీ అప్రమత్తమై, వేగంగా క్రీజులోకి అడుగుపెట్టి వికెట్ పడకుండా కాపాడుకుంది. అయితే ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. దీప్తి శర్మ ముఖంపై చిరునవ్వు కనిపిస్తున్నప్పటికీ, సోఫీ మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. మైదానంలోనే దీప్తిని ఉద్దేశించి కొన్ని అసభ్య పదజాలంతో దూషించినట్లు స్పష్టమైంది.

నోరు పారేసుకున్నానని అంగీకరించిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్..

మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సోఫీ ఎకిల్‌స్టోన్ ఈ ఘటనపై స్పందించింది. దీప్తి శర్మతో జరిగిన వాగ్వాదంలో తాను కొన్ని కఠినమైన పదాలు ఉపయోగించానని, ఆమెను తిట్టిపోశానని పరోక్షంగా అంగీకరించింది.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

“నేను మీడియా ముందు ఆ పదాలను చెప్పలేను. కానీ మా ఇద్దరి మధ్య కొన్ని మాటలకైతే జరిగాయి. దీప్తి ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటుంది, ఆమెకు ఇది అలవాటే. కాబట్టి దీనిపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతానికి ఈ విషయంలో నాకెలాంటి భావోద్వేగాలు లేవు” అంటూ సోఫీ వ్యాఖ్యానించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లో యూపీ వారియర్స్ జట్టు తరపున వీరిద్దరూ సహచర ఆటగాళ్లు కావడం గమనార్హం. అయినప్పటికీ దేశం తరపున ఆడేటప్పుడు ఈ స్నేహం పక్కనబెట్టి మైదానంలో తీవ్రంగా ఘర్షణ పడ్డారు.

లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఘన విజయం దిశగా..

ఈ వివాదం ఎలా ఉన్నా, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌పై భారత మహిళల జట్టు పూర్తి పట్టు సాధించింది. యస్తికా భాటియా సెంచరీ (113 పరుగులు) తో మెరవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ 57 పరుగులతో కీలక సహకారం అందించింది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఇంకా 327 పరుగులు చేయాల్సి ఉండగా, భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును కోలుకోకుండా దెబ్బతీస్తున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ విజయానికి కేవలం నాలుగు వికెట్ల దూరంలో ఉంది.

దీప్తి శర్మకు ఇది మొదటిసారి కాదు..!

క్రికెట్ నిబంధనల ప్రకారం మన్కడింగ్ రనౌట్ చట్టబద్ధమే అయినప్పటికీ, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీప్తి శర్మ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చార్లీ డీన్‌ను ఇదే తరహాలో రనౌట్ చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. ఆ సమయంలోనూ ఇంగ్లాండ్ మాజీలు, ఆటగాళ్లు దీప్తి క్రీడా స్ఫూర్తిని తప్పుబడుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? రూల్స్‌లో మార్పులు చేసిన ఈసీ
ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? రూల్స్‌లో మార్పులు చేసిన ఈసీ
లార్డ్స్ టెస్ట్‌లో ఉద్రిక్తత.. దీప్తిపై నోరుపారేసుకున్న ఇంగ్లీష్
లార్డ్స్ టెస్ట్‌లో ఉద్రిక్తత.. దీప్తిపై నోరుపారేసుకున్న ఇంగ్లీష్
అమ్మోరు సౌందర్య కెరీర్‌లో 3వ చిత్రంగా ప్రారంభం.. రిలీజ్ నాటికి..
అమ్మోరు సౌందర్య కెరీర్‌లో 3వ చిత్రంగా ప్రారంభం.. రిలీజ్ నాటికి..
కుప్పం ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలు.. చివరకు
కుప్పం ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలు.. చివరకు
చిల్లర లేదంటూ మంత్రినే బస్సు దిగమన్న కండక్టర్..! ఆ తర్వాత సీన్
చిల్లర లేదంటూ మంత్రినే బస్సు దిగమన్న కండక్టర్..! ఆ తర్వాత సీన్
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే
అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే
ఒక్కసారిగా అగ్రస్థానానికి ఎగబాకి.. ఆపై నింగిలోకి జారుకున్న చందమామ
ఒక్కసారిగా అగ్రస్థానానికి ఎగబాకి.. ఆపై నింగిలోకి జారుకున్న చందమామ
ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్
ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగతాయా..?
యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగతాయా..?
సోమవారం నాడు శివాలయంలో అరుదైన శ్వేతనాగు దర్శనం.. ఇదిగో వీడియో
సోమవారం నాడు శివాలయంలో అరుదైన శ్వేతనాగు దర్శనం.. ఇదిగో వీడియో