AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: మ్యాచ్ మధ్యలో పిరియడ్స్..! స్మృతి మంధాన ఆన్సర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన టెస్ట్ మ్యాచ్‌లో నెలసరి అనుభవాన్ని పంచుకుంది. ఆట మధ్యలో నెలసరి వల్ల ఎదురైన ఇబ్బందులు, దేశం కోసం నొప్పిని భరించి ఆడటం ఆమె వ్యాఖ్యలు మహిళా క్రీడాకారిణుల సవాళ్లను వెలుగులోకి తెచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో మహిళల శారీరక అవసరాలు, పీరియడ్స్ సమయంలో మద్దతు, నియమాలపై స్పష్టమైన మార్గదర్శకాల ఆవశ్యకతను ఈ చర్చ హైలైట్ చేసింది.

Smriti Mandhana: మ్యాచ్ మధ్యలో పిరియడ్స్..! స్మృతి మంధాన ఆన్సర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jun 09, 2026 | 12:13 PM

Share

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చేసిన తాజా వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే ఒక కీలక అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనకు నెలసరి వచ్చిన అనుభవాన్ని ఆమె ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకుంది. ఆ వీడియోలో మంధాన ఆట మధ్యలో నెలసరి రావడం వల్ల ఎదురైన ఇబ్బందులను వివరించింది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వాతావరణం, పిచ్ పరిస్థితులు, అంపైర్ల నిర్ణయాలు వంటి అంశాలు ఆటగాళ్ల నియంత్రణలో ఉండవని, అలాగే మహిళా క్రీడాకారుల విషయంలో పిరియడ్స్ కూడా ఒక కీలక అంశమని ఆమె పేర్కొంది.

“నేను భారత్ తరఫున ఆడుతున్నాను. జాతీయ జెర్సీ ధరించినప్పుడు మీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాల్సిందే. కొన్ని సందర్భాల్లో నెలసరి నొప్పిని కూడా అధిగమించి ఆట కొనసాగించాల్సి వస్తుంది” అని మంధాన చెప్పింది. దేశం కోసం ఎంతటి నొప్పినైనా భరించి ఆడతాము అని ఆమె చెప్పిన మాట క్రికెట్ అభిమానుల హృదయాలను తాకింది. ఉమెన్స్ క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడేవారికి ఈ అంశం ఒక చెంపపెట్టులాంటిది. అయితే శారీరక అసౌకర్యం తీవ్రమైనప్పుడు ఆటగాళ్లు ఎలా స్పందించాలి అనే అంశంపై కూడా ఆమె వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ప్యాడ్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అంపైర్‌ను అనుమతి కోరిన సంఘటనను ఆమె గుర్తు చేసుకుంది. “తెల్లటి దుస్తులు ధరించి ఉండటంతో పరిస్థితిని అంపైర్‌కు వివరించాను. ఆమె కూడా వెంటనే అర్థం చేసుకుంది” అని తెలిపింది.

ఇలాంటి అంశాల్లో రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

మేరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన క్రికెట్ చట్టాల ప్రకారం.. ఆటగాడు అనారోగ్యం, గాయం లేదా ఇతర సమంజసమైన కారణాలతో మైదానం వీడితే ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను అనుమతించవచ్చు. అయితే ఆ ప్రత్యామ్నాయ ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయగలడు. బౌలింగ్, వికెట్ కీపింగ్ లేదా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉండదు. అలాగే ఒక ఆటగాడు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువసేపు మైదానానికి దూరంగా ఉంటే బౌలింగ్ పరిమితులు వర్తిస్తాయి. మంధాన వ్యాఖ్యలు మహిళా క్రీడాకారుల శారీరక అవసరాలపై మరింత స్పష్టమైన మార్గదర్శకాల అవసరాన్ని వెలుగులోకి తెచ్చాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us