Smriti Mandhana : వరల్డ్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో స్మృతి మంధాన.. మహిళల ప్రపంచ కప్‌లో మూడో సెంచరీ
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మంధాన కేవలం 88 బంతుల్లోనే మెరుపు వేగంతో తన సెంచరీని పూర్తి చేసింది. ఈ టోర్నమెంట్‌లో స్మృతి మంధానకు ఇదే మొదటి సెంచరీ కాగా, ఇది ఆమె కెరీర్‌లో 14వది.

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మంధాన కేవలం 88 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసింది. ఈ టోర్నమెంట్‌లో మంధానకు ఇదే మొదటి సెంచరీ కాగా, ఇది ఆమె కెరీర్‌లో 14వది. నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (80), ఇంగ్లాండ్ (88)లపై వరుసగా హాఫ్ సెంచరీల తర్వాత, ఈసారి సెంచరీ పూర్తి చేసి మంధాన ఫామ్‌లోకి తిరిగి వచ్చినట్లు ప్రకటించింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన పలు రికార్డులను సమం చేయడంతో పాటు, భారత జట్టుకు భారీ విజయాన్ని అందించింది.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో న్యూజిలాండ్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌ను కనబరిచింది. ప్రారంభంలో తొలి మూడు ఇన్నింగ్స్‌లలో 30 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయిన స్మృతి మంధాన, ఆ తర్వాత తనదైన శైలిలో బ్యాటింగ్‌ను ప్రారంభించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లపై వరుసగా రెండు హాఫ్ సెంచరీల తర్వాత, న్యూజిలాండ్‌పై కేవలం 88 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసింది. స్మృతి మంధాన తన 95 బంతుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తం 109 పరుగులు చేసి భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది.
ఈ సెంచరీతో స్మృతి మంధాన వ్యక్తిగతంగా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. స్మృతి మంధానకు మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఇది మూడో సెంచరీ. ఆమె ఇంతకుముందు 2017, 2022 ప్రపంచ కప్‌లలో ఒక్కో సెంచరీ చేసింది. దీంతో ప్రపంచ కప్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును ఆమె సమం చేసింది. స్మృతి మంధాన కెరీర్‌లో ఇది 14వ వన్డే సెంచరీ. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్ (15 సెంచరీలు) ప్రపంచ రికార్డుకు మంధాన కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉంది. స్మృతి మంధానకు ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇది ఐదో సెంచరీ. దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన సౌతాఫ్రికాకు చెందిన తజ్మిన్ బ్రిట్స్ రికార్డును మంధాన సమం చేసింది.
స్మృతి మంధాన కేవలం వ్యక్తిగత రికార్డులనే కాక, ఓపెనింగ్ భాగస్వామ్యంలోనూ చరిత్ర సృష్టించింది. మంధాన తన సహచర ఓపెనర్ ప్రతీక రావల్తో కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరిద్దరి ఈ మెగా భాగస్వామ్యం భారత జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది. ఈ మంచి ఆరంభంతో టీమ్ ఇండియా స్ట్రాంగ్ పొజిషన్ కు చేరుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




