
భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించకపోవడం అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇటీవల వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ బౌలర్‌గా రాణించిన సిరాజ్‌ను ప్రధాన జట్టులో ఎంపిక చేయకపోవడం, కేవలం ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంచడం విమర్శలకు దారితీసింది.
BCCI నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. “నిజంగా చెప్పాలంటే, హర్షిత్ రాణా ఇప్పుడు సిరాజ్ స్థానంలో ఎంపికయ్యాడు, అలాగే వరుణ్ కూడా జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే అక్షర్, జడేజా, సుందర్, కుల్దీప్ ఉన్నారు. జట్టు ఎంపికలో అధికారం ఎవరికి ఉందో మనందరికీ తెలుసు, కాబట్టి ఈ నిర్ణయం ఆశ్చర్యంగా లేదు” అని ఒక అభిమాని కామెంట్ చేశాడు.
మరో అభిమాని, మహమ్మద్ సిరాజ్ నంబర్ వన్ వన్డే బౌలర్. గ్రౌండ్‌లో ఇటీవల అతని ఫామ్ అంత గొప్పగా లేకపోయినా, అతన్ని రిజర్వ్ జట్టులో ఉంచడం అవమానం అని, ప్రధాన జట్టులో ఎంపిక చేయకపోతే, కనీసం రిజర్వ్‌లో కూడా పెట్టకూడదా అంటూ అభిప్రాయపడ్డాడు.
కొందరు అభిమానులు సిరాజ్‌ను తప్పించడం వ్యూహాత్మకంగా సరైన నిర్ణయం కాదని చెబుతున్నారు. సిరాజ్‌లో కొన్ని లోపాలు ఉన్నా, జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో అతను భారత్‌కు అవసరమైన అనుభవాన్ని అందించాడు. కానీ అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేయడం చర్చనీయాంశం అని ఒక అభిమాని అభిప్రాయపడ్డాడు.
ఒకవైపు, సిరాజ్‌ను పక్కన పెట్టి కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వడాన్ని కొంతమంది సమర్థించినా, అతని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టులో చేర్చాలి అని భావిస్తున్నవారూ ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి గొప్ప టోర్నమెంట్‌లో అనుభవజ్ఞులైన బౌలర్లు అవసరం అనే వాదన కొనసాగుతోంది.
BCCI ఈ నిర్ణయంపై అధికారికంగా స్పందించాల్సి ఉన్నప్పటికీ, సిరాజ్‌కు జట్టులో స్థానం లభించకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఈ విషయంపై మరింత చర్చ జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (WK), రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా
నాన్ ట్రావెలింగ్ ప్రత్యామ్నాయాలు: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దుబే. (ఈ ముగ్గురు ఆటగాళ్ళు అవసరమైనప్పుడు దుబాయ్‌కు వెళతారు)
I can't understand why harshit ahead of Siraj in what basis Siraj was gun bowler in oddis GC wantedly showing favourism to KKR players.
feeling sad for Siraj 😢💔 pic.twitter.com/5ZzsOIjAf8
— Aditya ❤️🔥 (@AgkAg45441) February 11, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..