Shubman Gill: న్యూజిలాండ్‌పై గిల్ చేసిన సెంచరీతో బద్దలైన కోహ్లీ, రైనా రికార్డులు.. ఆ లెక్కలలో కూడా గిల్..

|

Feb 02, 2023 | 6:15 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసిన గిల్.. భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో హైస్కోరర్‌గా నిలిచాడు. అంతేకాక ఈ ఇన్నింగ్స్‌తో గిల్.. కోహ్లీ పేరిట ఉన్న

Shubman Gill: న్యూజిలాండ్‌పై గిల్ చేసిన సెంచరీతో బద్దలైన కోహ్లీ, రైనా రికార్డులు.. ఆ లెక్కలలో కూడా గిల్..
Shubman Gill Records In T20i
Follow us on

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 166 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన న్యూజిలాండ్ భారత్ బౌలర్ల ధాటికి తాలలేక 66 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీ20 సిరీస్‌, మూడో మ్యాచ్ విజయం భారత్ సొంతమైంది. అయితే భారత్ ఈ భారీ స్కోరును అందుకోవడంలో, సాధించిన విజయంలో యువ ఆటగాడు శుభమాన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో కేవలం 63 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసిన గిల్.. భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో హైస్కోరర్‌గా నిలిచాడు. అంతేకాక ఈ ఇన్నింగ్స్‌తో గిల్.. కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తిరగరాయడమే కాక మరి కొన్ని రికార్డులను కూడా సృష్టించాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.. 

  1. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మ్యాన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అంతకు ముందు ఈ ఘనతను సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సాధించారు.
  2. 63 బంతులలోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసిన గిల్.. భారత్ తరఫున టీ20 ఫార్మాట్‌లో హైస్కోరర్‌గా నిలిచాడు. ఇంతక ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 5 నెలల క్రితం(8 సెప్టెంబర్ 2022) ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 122 పరుగులు చేసిన కోహ్లీ పేరిట ఈ రికార్డ్ ఉండేది.
  3. భారత తరఫున అంతర్జాతీయ టీ20లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 23 ఏళ్ల 146 రోజుల వయసులో గిల్ ఈ ఘనతను సాధించడం ద్వారా సురేశ్ రైనా (23 ఏళ్ల 156 రోజులు)ను వెనక్కు నెట్టాడు.
  4. టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోరు(126 నాటౌట్) చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇక ఈ రికార్డు ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన రిచర్డ్ లెవీ (117 నాటౌట్) పేరిట ఉండేది. ఇదే జట్టుపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో కూడా గిల్ డబుల్ సెంచరీ(208)తో అత్యధిక స్కోరును నమోదు చేశాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. అంతర్జాతీయ టీ20లో గిల్‌కి ఇదే తొలి సెంచరీ. భారత్‌ తరఫున ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన  ఏడో ఆటగాడిగా గిల్ నిలిచాడు. అతని కంటే ముందు సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు.
  7. 2022 జనవరి 14 నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో మొత్తం 5 సెంచరీలు సాధించాడు శుభమాన్ గిల్. ఈ నిర్ధిష్ట కాలంలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇదే.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.