18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. తోపు బౌలరైనా వీళ్లముందు తుస్సుమనాల్సిందే

Shubman Gill Sai Sudarshan broke a big IPL record: IPL 2025లో గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ బ్యాటర్స్ ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ, ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకుసాగుతున్నారు.

18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రికార్డ్.. తోపు బౌలరైనా వీళ్లముందు తుస్సుమనాల్సిందే
Shubman Gill Sai Sudarshan Broke A Big Ipl Record

Updated on: Apr 22, 2025 | 6:44 AM

Shubman Gill Sai Sudarshan broke a big IPL record: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా 39వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనింగ్ జోడీ మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శుభమన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్ కు 74 బంతుల్లో 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం ద్వారా జట్టుకు తుఫాన్ ఆరంభాన్ని అందించారు. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఈ ఇద్దరు బ్యాటర్స్ కేకేఆర్ కెప్టెన్ నిర్ణయం తప్పని నిరూపించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ ఐపీఎల్‌లో కొత్త రికార్డును సృష్టించారు. దీన్ని బద్దలు కొట్టడం చాలా కష్టమనే చెప్పాలి.

ఐపీఎల్‌లో గిల్, సుదర్శన్ అద్భుతాలు..

ఐపీఎల్ చరిత్రలో ఒక భారత జోడీ 6 సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే తొలిసారి. దీంతో పాటు, గిల్, సుదర్శన్ జోడీ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లలో 8 ఇన్నింగ్స్‌లలో 56 సగటుతో 448 పరుగులు చేశారు. ఇందులో రెండు సెంచరీ భాగస్వామ్యాలు, రెండు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన జోడీగా నిలిచారు. ఆసక్తికరంగా, రెండవ అత్యధిక పరుగులు చేసిన జోడీ గురించి చెప్పుకంటే ఇందులోనూ సుదర్శన్ పేరు ఉండడం గమనార్హం. జోస్ బట్లర్‌తో కలిసి 352 పరుగులు చేశాడు.

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు..

ఐపీఎల్ చరిత్రలో, సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్ జోడీ ఆరుసార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ రికార్డులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ జోడీ నంబర్ వన్ స్థానంలో ఉంది. వీరిద్దరు కలిసి 10 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. రెండవ స్థానంలో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ జోడీ ఉంది. వీరిద్దరు 9 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడవ స్థానంలో సాయి సుదర్శన్, గిల్ జోడీ ఉంది. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ జోడీ ఉంది. వీరిద్దరు 6 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ కూడా 6 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఘనతను సాధించారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ ఘనతను 5 సార్లు చేశారు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో కూడా 5 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప కూడా 5 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..