Ind vs Aus 4th T20I : వాషింగ్టన్, బుమ్రా మాయ.. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా పై భారత్ విజయం
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఈ రోజు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఆస్ట్రేలియాకు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Ind vs Aus 4th T20I : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఈ రోజు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఆస్ట్రేలియాకు 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభమన్ గిల్ (46), అభిషేక్ శర్మ (28) కీలక పరుగులు చేయగా శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (20) పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరపున నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా చెరో 3 వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నెమ్మదిగా ప్రారంభించింది. తొలి మూడు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే వచ్చినా, వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడింది. అభిషేక్ శర్మకు లభించిన ఒక క్యాచ్ అవకాశం జారవిడవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 49 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 26, అభిషేక్ శర్మ 22 పరుగులతో క్రీజ్‌లో నిలబడ్డారు.
అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని స్థానంలో వచ్చిన శివమ్ దూబేకు గౌతమ్ గంభీర్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం చర్చనీయాంశమైంది. భారత స్కోరు 10 ఓవర్లకు 75/1 వద్ద ఉండగా, ఆ తర్వాతి ఓవర్లలో దూకుడుగా ఆడాలని టీమిండియా భావించింది. అయితే శివమ్ దూబే 18 బంతుల్లో 22 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 38 బంతుల్లో 46 పరుగులు చేసి నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 9 బంతుల్లో 20 పరుగులు చేసి జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తిలక్ వర్మ (5), జిగేష్ శర్మ (3), వాషింగ్టన్ సుందర్ (12) తక్కువ పరుగులకే ఔటయ్యారు. చివరకు భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా తలో 3 వికెట్లు తీశారు.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ప్రారంభించింది. మాథ్యూ షార్ట్, మిచెల్ మార్ష్ క్రీజ్‌లోకి వచ్చారు. తొలి పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా 48 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ ఐదవ ఓవర్‌లో మాథ్యూ షార్ట్‌ను (19 బంతుల్లో 25 పరుగులు) పెవిలియన్‌కు పంపి భారత జట్టుకు మొదటి బ్రేక్‌త్రూ ఇచ్చాడు.
అక్షర్ పటేల్ మరోసారి అద్భుతం చేసి జోష్ ఇంగ్లిస్‌ను 11 బంతుల్లో 12 పరుగులు (2 ఫోర్లు) వద్ద క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు (4 ఫోర్లు) చేసి శివమ్ దూబే బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టిమ్ డేవిడ్ 9 బంతుల్లో 14 పరుగులు చేసి శివమ్ దూబే బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు. జోష్ ఫిలిప్ 10 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 2 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.
చివర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 17వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్‌ను ఎల్‌బిడబ్ల్యు చేసి, తర్వాతి బంతికే జేవియర్ బార్ట్‌లెట్‌ను ఔట్ చేసి ఆస్ట్రేలియా ఆశలను దెబ్బతీశాడు. జస్ ప్రీత్ బుమ్రా తన స్పెల్ చివరి ఓవర్‌లో బెన్ డ్వార్షుయిస్‌ను బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగుల వద్ద ముగిసింది. భారత్ ఈ మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఫుల్ స్కోర్ బోర్డ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




