Asia Cup 2023: రేపే టీమిండియా స్వ్కాడ్.. ఆసియాకప్‌లో ఆడేందుకు ఆ ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్?

Asia Cup 2023, IND vs PAK: ఈ సంవత్సరం ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో తలపడనుంది. సెప్టెంబరు 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మొత్తంగా ఈటోర్నీలో 6 టీంలు పాల్గొంటున్నాయి.

Asia Cup 2023: రేపే టీమిండియా స్వ్కాడ్.. ఆసియాకప్‌లో ఆడేందుకు ఆ ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్?
Shreyas Iyer

Updated on: Aug 20, 2023 | 10:43 AM

Asia Cup 2023: ఆసియా కప్‌ 2023 లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. అయితే దీనికి ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇద్దరు ఆటగాళ్లు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొన్నారు.

ఫిట్‌నెస్ టెస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 50 ఓవర్లు మొత్తం ఫీల్డింగ్ చేశాడు. అలాగే 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంటే ఎలాంటి అసౌకర్యం కలగకుండా వన్డేలు ఆడేందుకు అయ్యర్ సిద్ధమయ్యాడు.

ఇవి కూడా చదవండి

శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శనను NCA చీఫ్ VVS లక్ష్మణ్, బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిట్కర్ నిశితంగా పరిశీలించారు. తద్వారా ఆసియా కప్ ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీని ప్రకారం ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ జట్టులో అయ్యర్ కనిపించడం దాదాపు ఖాయం.

కేఎల్ రాహుల్ కూడా..

తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆడలేదు. ఆదివారం రెండో వార్మప్ మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్‌తో కేఎల్ రాహుల్ కూడా పోటీ పడనున్నట్లు తెలిసింది.

బ్యాటింగ్‌తోపాటు వికెట్ కీపింగ్ బాధ్యతను అట్ట కేఎల్ రాహుల్ నిర్వహించాల్సి రావొచ్చు. కాబట్టి పూర్తి ఫిట్‌నెస్‌ను రెండు విభాగాల్లో చూపించాల్సి ఉంటుంది. ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ ఫిట్‌నెస్ నివేదికను ఆదివారం సాయంత్రంలోగా బీసీసీఐకి సమర్పించనున్నారు.

టీమిండియాను ఎప్పుడు ఎంపిక చేస్తారు?

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. అంటే ఆదివారం సాయంత్రానికి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ల ఫిట్‌నెస్ నివేదిక బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చేరనుంది. నివేదికను పరిశీలించి ఇద్దరు ఆటగాళ్లను ఉంచాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.

శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే చాలా వరకు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కాబట్టి, అతని ఎంపిక దాదాపు ఖాయమైంది. కేఎల్ రాహుల్ ఆసియా కప్ భవిష్యత్తు రేపు ఖరారు కానుంది.

ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈసారి ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో తలపడనుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 2న ఆసియా కప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..