‘టెస్టుల్లో రోహిత్ వారసుడు అతడే.. రాహుల్, బుమ్రాతో పాటు విరాట్ ఫ్రెండ్‌కు నో ఛాన్స్’..

రోహిత్ శర్మ ప్రత్యామ్నాయం ఎవరు.? ఇందుకు చాలామంది యువ ఆటగాళ్ల పేర్లు లిస్టులో ఉన్నాయి. అయితే దీనికి సమాధానం శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ చెప్పేశాడు. రోహిత్ తర్వాత టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించే సత్తా ఈ టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక అతడు మరెవరో కాదు.. మీరు ఆ ప్లేయర్ ఎవరో గెస్ చేయగలరా.. ఐపీఎల్‌లోనూ ఓ జట్టుకు సారధ్యం వహించి.. ఫైనల్స్ వరకు చేర్చాడు.. ప్రస్తుతం గాయంతో టీమిండియాకు దూరమయ్యాడు.

'టెస్టుల్లో రోహిత్ వారసుడు అతడే.. రాహుల్, బుమ్రాతో పాటు విరాట్ ఫ్రెండ్‌కు నో ఛాన్స్'..
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 01, 2023 | 6:34 PM

మరో 3,4 సంవత్సరాల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే. ఈ సమయంలో భారత క్రికెట్‌కు తదుపరి కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు అందరిలోనూ జరుగుతోన్న చర్చ. రోహిత్ శర్మ ప్రత్యామ్నాయం ఎవరు.? ఇందుకు చాలామంది యువ ఆటగాళ్ల పేర్లు లిస్టులో ఉన్నాయి. అయితే దీనికి సమాధానం శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ చెప్పేశాడు. రోహిత్ తర్వాత టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించే సత్తా ఈ టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక అతడు మరెవరో కాదు.. శ్రేయాస్ అయ్యర్.

టెస్టుల్లో రోహిత్ శర్మకు.. భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యరే అత్యుత్తమ ప్రత్యామ్నాయం. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీ సాధించిన విషయం విదితమే. అలాగే అదే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక ప్రస్తుతం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

టీమిండియా తదుపరి కెప్టెన్‌గా అయ్యర్ అర్హుడని చమిందర్ వాస్ పేర్కొన్నాడు. ఇప్పటికే అయ్యర్ టెస్టుల్లో సెంచరీ సాధించడమే కాకుండా.. అతడిలో నాయకత్వ పటిమ కూడా ఎక్కువేనని వాస్ చెప్పాడు. ‘అతడికి జట్టును నిర్వహించగల సామర్థ్యం ఉందని, అందువల్ల అతడు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా సరైన ఎంపికవుతుందని స్పష్టం చేశాడు.

ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టు సిరీస్‌లో అయ్యర్ వెన్నునొప్పితో గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 31 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో అయ్యర్ తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చెయ్యొచ్చునని భావిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్‌కు కీలకం..

ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్నందున అయ్యర్ త్వరగా పునరాగమనం చేస్తే, జట్టుకు బలం చేకూరుతుందని టీమిండియా భావిస్తోంది.