IND vs WI 2nd Test : శుభ్‌మన్ గిల్ చేసిన తప్పుతో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్.. మ్యాచ్ మధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. మొదటి రోజు అంతా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 173 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న యశస్వి జైస్వాల్, రెండో రోజు ఆట మొదలైన వెంటనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

IND vs WI 2nd Test : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ కల చెదిరిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జైస్వాల్, రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్‌కు కారణం తోటి బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్తో ఏర్పడిన మిస్ అండర్ స్టాండింగ్. కేవలం 173 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించిన జైస్వాల్, డబుల్ సెంచరీకి అతి చేరువలో నిరాశతో వెనుదిరిగాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. మొదటి రోజు అంతా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 173 పరుగుల వద్ద నాటౌట్‌గా ఉన్న యశస్వి జైస్వాల్, రెండో రోజు ఆట మొదలైన వెంటనే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. జైస్వాల్ మిడ్-ఆఫ్ దిశగా బలంగా షాట్ కొట్టి, వేగంగా పరుగు కోసం సగం పిచ్ దాటి వచ్చాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, అతన్ని ఆగిపోవాలని సైగ చేశాడు. వెనక్కి మళ్లే ప్రయత్నం చేసేలోపే ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా వికెట్లను తాకడంతో జైస్వాల్ ఔట్ అయ్యాడు.
ఈ అనూహ్య రనౌట్ తర్వాత జైస్వాల్ ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది. పెవిలియన్ వైపు వెళ్లే సమయంలో కెమెరాలకు చిక్కిన దృశ్యాలలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. అతను 253 బంతుల్లో 22 ఫోర్లతో 173 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో సంయమనం పాటించిన జైస్వాల్, బంతి పాతబడే కొద్దీ తన స్ట్రైక్ రేట్‌ను పెంచాడు. 82 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాత కేవలం 63 బంతుల్లోనే తదుపరి 50 పరుగులను పూర్తి చేయడం విశేషం.
150 పరుగుల మార్కును దాటిన తర్వాత అతను డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. దీనిపై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మ్యాచ్‌కు ముందు మాట్లాడుతూ.. జైస్వాల్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఆకలి, మ్యాచ్‌ను ఒక్కడే మార్చగల సామర్థ్యం ఉందని ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో అతను ట్రిపుల్ సెంచరీ కొట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు.. కానీ ఒక తప్పుడు నిర్ణయం ఆ అవకాశాన్ని దూరం చేసింది.
Shubman Gill's Jealousy towards Yashasvi Jaiswal #INDvWI pic.twitter.com/81tcf8RC5E
— Lokesh Saini (@LokeshVirat18K) October 11, 2025
రనౌట్ రూపంలో ఇన్నింగ్స్ ఆగిపోయినప్పటికీ, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని ఈ ప్రదర్శన రుజువు చేసింది. అతని టెక్నిక్, ఓర్పు, దూకుడు అన్నింటి కలయిక అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో అతను 173 పరుగులు చేసిన తీరు చూస్తే, భవిష్యత్తులో అతను అనేక పెద్ద రికార్డులను తన పేరిట లిఖించుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




