IND vs WI 2nd Test : రెండ్రోజుల్లో వెస్టిండీస్‌ను ఉతికారేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. తొలి ఇన్నింగ్స్‌లో 518 రన్స్‌కు డిక్లేర్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

IND vs WI 2nd Test : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్ (38) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ తో జతకలిసిన జైస్వాల్, సెంచరీ పార్టనర్ షిప్ నెలకొల్పారు. సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడి 87 పరుగుల వద్ద అవుట్ అవగా, జైస్వాల్ పట్టుదలగా ఆడి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 173 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆటలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
రెండో రోజు ఆట ప్రారంభంలోనే యశస్వి జైస్వాల్ (175) రనౌట్ రూపంలో నిరాశపరిచాడు. అయితే, జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జోరును కొనసాగించాడు. గిల్ 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్‌లతో అజేయంగా 128 పరుగులు చేసి భారీ స్కోరును అందించాడు. గిల్‌కు తోడుగా నితీష్ కుమార్ రెడ్డి 43 పరుగులు చేసి సహకరించగా, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి ఔటయ్యాడు.
ధ్రువ్ జురెల్ ఔట్ అయిన వెంటనే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఈ భారీ స్కోరు సాధించడంలో గిల్ సెంచరీ కీలక పాత్ర పోషించింది.
రెండో టెస్టు మ్యాచ్ కోసం భారత్, వెస్టిండీస్ జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
భారత ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్:
జాన్ క్యాంప్‌బెల్, తేజ్‌నరైన్ చంద్రపాల్, అలిక్ అథానాఝ్, షై హోప్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారి పియెర్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




