AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : దెబ్బ తగిలినా పట్టువదలని విక్రమార్కుడు.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో బ్యాటింగ్‌లో రాణించిన సాయి సుదర్శన్, ఫీల్డింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. చేతికి బలంగా దెబ్బ తగిలినా లెక్క చేయకుండా క్యాచ్‌ను పట్టి వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్‌ను పెవిలియన్ చేర్చాడు.

VIDEO : దెబ్బ తగిలినా పట్టువదలని విక్రమార్కుడు.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్
Sai Sudharsan (1)
Rakesh
|

Updated on: Oct 11, 2025 | 6:04 PM

Share

VIDEO : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు సాయి సుదర్శన్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో బ్యాటింగ్‌లో రాణించిన సాయి సుదర్శన్, ఫీల్డింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో, చేతికి బలంగా దెబ్బ తగిలినా లెక్క చేయకుండా, అద్భుతమైన క్యాచ్‌ను పట్టి వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ విస్మయపరిచే క్యాచ్‌ను చూసి కామెంటరీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ సైతం ఆశ్చర్యపోయారు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 518 పరుగులు చేసి డిక్లేర్ చేసిన తర్వాత, వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. విండీస్ 8వ ఓవర్‌లో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (10 పరుగులు)ను ఔట్ చేయడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా వేసిన ఆ ఓవర్‌లోని రెండో బంతిని జాన్ క్యాంప్‌బెల్ బలంగా స్వీప్ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా షార్ట్ లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న సాయి సుదర్శన్ చేతికి తాకింది.

బంతి వేగంగా తాకడంతో అతనికి దెబ్బ తగిలినా, సుదర్శన్ ఆ క్యాచ్‌ను వదలకుండా పట్టుకున్నాడు. అతని ఈ అసాధారణ ప్రయత్నానికి క్యాంప్‌బెల్ నిరాశగా పెవిలియన్ వైపు వెళ్లక తప్పలేదు. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ కూడా ఆ క్యాచ్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్యాచ్ పట్టిన వెంటనే సాయి సుదర్శన్‌కు చేతికి దెబ్బ తగలడంతో, అతను గాయంతో మైదానాన్ని వీడవలసి వచ్చింది. ఆ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అతని అంకితభావం, అద్భుతమైన ఫీల్డింగ్‌ను చూసి క్రికెట్ అభిమానులు, నిపుణులు ప్రశంసిస్తున్నారు.

ఢిల్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటాడు. టీమిండియా భారీ స్కోరు సాధించడంలో అతడి ఇన్నింగ్స్ కూడా కీలకం. సాయి సుదర్శన్ 165 బంతుల్లో 12 ఫోర్ల సహాయంతో 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయినా, తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో సాయి సుదర్శన్‌కు రెండవ హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు అతను ఆడిన 5 టెస్ట్ మ్యాచ్‌లలోని 8 ఇన్నింగ్స్‌లలో 29.25 సగటుతో మొత్తం 234 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..