ఒరే నఖ్వీ.. IPLతో పోటీ అన్నావ్.. కట్‌చేస్తే.. PSLతో పాక్ పరువు తీసేశావ్‌గా: పాక్ దిగ్గజం ఫైర్

మాజీ పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ పెరిగిపోవడంతో అంతర్జాతీయ ఆటగాళ్లు ఐపీఎల్ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. స్వదేశీ అభిమానులు సైతం ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం పీఎస్ఎల్ కు పెద్ద సవాలుగా మారిందని ఆయన తెలిపారు.

ఒరే నఖ్వీ.. IPLతో పోటీ అన్నావ్.. కట్‌చేస్తే.. PSLతో పాక్ పరువు తీసేశావ్‌గా: పాక్ దిగ్గజం ఫైర్
Psl 2026

Updated on: Mar 24, 2026 | 1:37 PM

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) భవిష్యత్తుపై మాజీ పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీఎస్ఎల్ లీగ్ దుకాణం సర్దుకోవాల్సి వస్తుందని పరోక్షంగా ఆయన హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ రోజురోజుకు పెరిగిపోతుందని, ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ నిలబడలేకపోతుందని అక్తర్ స్పష్టం చేశారు.

విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ ను వదిలి ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్న ప్రస్తుత పరిస్థితిపై షోయబ్ అక్తర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఇప్పటికే కొందరు అంతర్జాతీయ ప్లేయర్లు పీఎస్ఎల్ నుంచి తప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక స్టార్ ఆటగాడు దసున్ షనక కూడా చేరారు. ఐపీఎల్ కు పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ ప్లేయర్స్ ఇతర టి20 లీగ్ లను వదిలి భారత టి20 టోర్నీలో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిణామాలపై షోయబ్ అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు పీఎస్ఎల్ ను వదిలి ఐపీఎల్ లో చేరుతున్నారని, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే పీఎస్ఎల్ ఎంతకాలం నిలుస్తుందో అనుమానంగా ఉందని అక్తర్ అన్నారు. ఇలాగే జరిగితే త్వరలోనే పీఎస్ఎల్ మూతపడే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా పీఎస్ఎల్ కంటే ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని అక్తర్ పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం పీఎస్ఎల్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ ఉన్న ప్లేయర్లు లేకపోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే పీఎస్ఎల్ కు పెద్ద సవాలుగా మారిందని షోయబ్ అక్తర్ తెలిపారు.

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతోంది. భారీ పారితోషకాలు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, గ్లోబల్ వ్యాప్తి కారణంగా విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. దీనివల్ల ఇతర టి20 లీగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది చాలదు అన్నట్టుగా, కొన్నిసార్లు ప్రేక్షకులు లేకుండానే గ్రౌండ్ లో పీఎస్ఎల్ మ్యాచ్‌లను ఆడిస్తుండటం సొంత దేశ అభిమానులకే పీఎస్ఎల్ పై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తోందని షోయబ్ అక్తర్ అన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ ను కొనసాగించడం కష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

అంతర్జాతీయ ప్లేయర్ల వలస, దేశీయ అభిమానుల ఆసక్తి తగ్గడం వంటి అంశాలు పీఎస్ఎల్ భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని అక్తర్ స్పష్టం చేశారు. ఈ ధోరణి కొనసాగితే పాకిస్తాన్ క్రికెట్ కు, పీఎస్ఎల్ కు గడ్డు కాలం ఎదురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us