IND vs SA ODI Squad: ఉమ్రాన్ నుంచి సర్ఫరాజ్ వరకు.. టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కని 4 ప్లేయర్స్ వీరే..

|

Oct 03, 2022 | 6:55 AM

IND vs SA ODI 2022: దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఉండగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

IND vs SA ODI Squad: ఉమ్రాన్ నుంచి సర్ఫరాజ్ వరకు.. టీమిండియా వన్డే జట్టులో చోటు దక్కని 4 ప్లేయర్స్ వీరే..
Ind Vs Sa Odi Squad
Follow us on

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో పాటు రజత్ పాటీదార్, ముఖేష్ కుమార్‌లపై సెలక్టర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 6న లక్నోలో జరగనుంది. అయితే, సర్ఫరాజ్ ఖాన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. టీమ్ ఇండియా ప్రకటన తర్వాత నిరాశకు గురైన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం..

ఉమ్రాన్ మాలిక్..

IPL 2022లో ఉమ్రాన్ మాలిక్ తన వేగంతో చాలా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత భారత జట్టులో అవకాశం వచ్చినా.. టీమ్ ఇండియాకు ఈ బౌలర్ ప్రదర్శన మిశ్రమంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు లేకపోవడంతో ఉమ్రాన్ మాలిక్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌లో అవకాశం వస్తుందని భావించినా.. ఈ యువ బౌలర్‌కు నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కలేదు. అయితే, టీ20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా గాయపడిన తర్వాత, ఉమ్రాన్ మాలిక్ భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

కుల్దీప్ సేన్..

IPL 2022లో కుల్దీప్ సేన్ రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో వెటరన్‌ల దృష్టిని ఆకర్షించాడు. అంతే కాకుండా దేశవాళీ క్రికెట్‌లో కూడా ఈ బౌలర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బౌలర్‌ను దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో చోటిస్తారని భావించారు. కానీ, కుల్దీప్ సేన్‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఈ యువ బౌలర్ IPL 2022 7 మ్యాచ్‌లలో 29.63 సగటు, 9.42 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు.

పృథ్వీ షా..

పృథ్వీ షా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. IPL 2022లో పృథ్వీ షా బ్యాట్ మౌనంగా ఉంది. కానీ, ఆ తర్వాత ఈ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో భారత సెలక్టర్లు పృథ్వీ షాపై ఆధారపడవచ్చని భావించినా అది కుదరలేదు. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు.

సర్ఫరాజ్ ఖాన్..

ముంబై యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఇరానీ కప్‌లో సౌరాష్ట్రపై సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టులోకి ఎంట్రీ దక్కలేదు. నిజానికి ఈ ముంబై మేధావికి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. కానీ, అది జరగలేదు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌‌తో తలపడే భారత జట్టు ఇదే..

శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.