Sam Curran IPL 2023 Auction: సామ్ కరన్‌పై కురిసిన కాసుల వర్షం.. ఐపీఎల్ వేలం చరిత్రలోనే భారీ ప్రైజ్..
Sam Curran Auction Price: ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కోసం బెంగళూర్, ముంబై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన కరన్‌ను..
Sam Curran Auction Price: ఐపీఎల్ 2019లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్‌ను తొలిసారిగా పంజాబ్ కింగ్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో విడుదలయ్యాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది గాయం కారణంగా మెగా వేలంలో పాల్గొనలేదు. కాగా, సామ్ కరణ్ ఈ T20 ప్రపంచ కప్‌లోని ఆరు మ్యాచ్‌లలో 6.52 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 13 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు. ఫైనల్‌లోనూ 12 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఈ లెక్కలతోనే ఈ మినీ వేలంలో అందరిచూపను తనవైపునకు తిప్పుకున్నాడు.
ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ కోసం బెంగళూర్, ముంబై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన కర్రన్‌ను రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. బేస్ ధర రూ.2 కోట్లు కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ దక్కించుకున్నాడు.
అత్యంత ఖరీదైన సామ్ కరణ్.. క్రిస్ మోరిస్ రికార్డును బద్దలు..
సామ్ కరణ్ IPL వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్ అతడిని రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో అత్యంత ఖరీదైన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ పేరిట ఉంది. రూ. 16.25 కోట్లు దక్కించుకున్నాడు. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడు కరణ్ కాదు.
ఇక ఐపీఎల్‌లో సామ్ కరణ్ కెరీర్ పరిశీలిస్తే.. మొత్తం 32 మ్యాచులు ఆడాడు. ఇందులో 337 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 32 వికెట్లు పడగొట్టాడు.