AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Sudharsan : ఐపీఎల్ సక్సెస్ సీక్రెట్ టెస్టుల్లో పని చేస్తుందా ? జట్టులోకి రాకముందే కెప్టెన్ మాట వినని సాయి సుదర్శన్

శుభ్‌మన్ గిల్ అడిగినా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి నిరాకరించిన సాయి సుదర్శన్, తన కొత్త ప్రాక్టీస్ పద్ధతిని అమలు చేస్తున్నాడు. ఐపీఎల్‌లో సక్సెస్ అయిన ఈ విధానం టెస్టుల్లోనూ పనిచేస్తుందా? కరుణ్ నాయర్ స్థానంలో సాయి నాలుగో టెస్టులో ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Sai Sudharsan : ఐపీఎల్ సక్సెస్ సీక్రెట్ టెస్టుల్లో పని చేస్తుందా ? జట్టులోకి రాకముందే కెప్టెన్ మాట వినని సాయి సుదర్శన్
Sai Sudharsan
Rakesh
|

Updated on: Jul 23, 2025 | 12:24 PM

Share

Sai Sudharsan : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ పక్కగా వెళ్తూ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తావా? అని అడిగాడు. సిరీస్‌లో జట్టు 1-2తో వెనుకబడి ఉన్నప్పుడు తర్వాతి మ్యాచ్ గెలవడం అత్యవసరం అయినప్పుడు కెప్టెన్ వచ్చి నెట్స్‌లో బ్యాటింగ్ చేయమని అడిగితే సాధారణంగా ఏ ఆటగాడైనా అవుననే చెబుతాడు. కానీ, సాయి సుదర్శన్ మాత్రం అందుకు నిరాకరించాడు. అయితే, శుభ్‌మన్ గిల్ అస్సలు కోపగించుకోలేదు. ఎందుకంటే, మ్యాచ్‌కు ఒక రోజు ముందు సాయి సుదర్శన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయడనే విషయం గిల్‌కు తెలుసు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సందర్భంగా అతను మ్యాచ్‌కు ఒక రోజు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం మానేశాడు. ఐపీఎల్‌లో కూడా గిల్ అతనికి కెప్టెన్ కాబట్టి, ఈ విషయం గిల్‌కు బాగా తెలుసు.

ఐపీఎల్ 2024 సమయంలో మైదానంలో ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం వల్ల సాయి సుదర్శన్ అలసిపోయినట్లు భావించాడు. గుజరాత్ టైటాన్స్ కోచ్‌లు ఈ విషయాన్ని గమనించి, మ్యాచ్‌కు ఒక రోజు ముందు విశ్రాంతి తీసుకోవాలని అతనికి సలహా ఇచ్చారు. ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్ తన ప్రాక్టీస్ ప్లాన్‌ను మార్చుకున్నాడు. అతను మ్యాచ్‌కు రెండు రోజుల ముందు గంటల తరబడి నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ, చెమట పట్టేలా కష్టపడేవాడు. కానీ మ్యాచ్‌కు ఒక రోజు ముందు విశ్రాంతి తీసుకునేవాడు. అతన్ని ఒక రోజు ముందు హోటల్‌లోనే ఉండమని చెప్పినప్పటికీ, అతను అలా చేయడానికి నిరాకరించి జట్టుతో పాటు మైదానానికి వెళ్ళేవాడు. అయితే, ఆ రోజు అతను కేవలం తేలికపాటి జాగింగ్, స్ట్రెచింగ్ మాత్రమే చేసేవాడు. దీని ఫలితం సానుకూలంగా వచ్చింది. ఐపీఎల్ 2025లో అతను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

కేవలం మ్యాచ్‌కు ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేయకపోవడం వల్లనే ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానం ఖాయమైందని చెప్పలేం. అయితే, మంగళవారం అతను పిచ్‌ను పరిశీలించాడు. షాడో ప్రాక్టీస్ కూడా చేశాడు. ఒకసారి పిచ్ కవర్లతో ఉన్నప్పుడు మరోసారి మంచి ఎండ ఉన్నప్పుడు ఇలా అతను రెండుసార్లు పిచ్‌పైకి వెళ్లి షాడో నాకింగ్ చేశాడు.. దీని బట్టి చూస్తే, అతను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాయి హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్టులో అరంగేట్రం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులేమీ చేయకుండానే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. మూడో నంబర్‌లో ఆడుతూ అతను ఫెయిల్ అయ్యాడు. దీంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో కరుణ్ నాయర్ మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు, కానీ అతను కూడా నిరాశపరిచాడు.

అయితే, సాయి సుదర్శన రాకతో కరుణ్ నాయర్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి బయటపడతాడని దీని అర్థం కాదు. అతనికి మరో అవకాశం ఇవ్వవచ్చు, కానీ మూడో నంబర్‌లో సాయి సుదర్శన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. నాయర్ ఈ సిరీస్‌లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో మొత్తం 131 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ కూడా రాలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..