- Telugu News Sports News Cricket news Sachin tendulkar retirement from odi cricket on this day 18th march vs pakistan virat kohli key innings
IND vs PAK: పాక్‌తో కీలక మ్యాచ్.. కోహ్లీ కెరీర్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. కన్నీళ్లు పెట్టిన సచిన్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
On This Day: భారతదేశపు దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డే మ్యాచ్ 18 మార్చి 2012న ఆడాడు. సచిన్ తన చివరి వన్డే పాకిస్థాన్‌తో ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కూడా ప్రత్యేకంగా నిలిచింది.
Updated on: Mar 18, 2023 | 12:09 PM

భారత క్రికెట్ చరిత్రలో మార్చి 18 తేదీ చాలా ముఖ్యమైనది. విరాట్ కోహ్లి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన ఇదే రోజు సచిన్ టెండూల్కర్ అభిమానులు గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్నారు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 18) జరిగిన ఒకే మ్యాచ్‌లో ఈ భావోద్వేగం జరిగింది.

2012లో ఆసియాకప్‌లో భారత్ టీం పాకిస్థాన్‌తో తలపడింది. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుత బ్యాటింగ్ చేసి 330 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించి వీడ్కోలు పలికాడు.

పాకిస్థాన్ జట్టు కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్‌కు వచ్చిన మహ్మద్ హఫీజ్ 105, నాసిర్ జంషెడ్ 112 పరుగులు చేశారు. దీంతో పాటు యూనస్ ఖాన్ కూడా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.

సమాధానంగా భారత్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే విరాట్ అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీతో పాటు రోహిత్ శర్మ 68 పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ 52 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి పాక్ అభిమానులను కంటతడి పెట్టించింది.

ఈ మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత సచిన్ ఎప్పుడూ నీలి రంగు జెర్సీలో కనిపించకపోవడంతో భారత అభిమానులు గుండెలు బాదుకున్నారు. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలతో సహా 18426 పరుగులు చేశాడు. ఇది కాకుండా సచిన్ 96 అర్ధ సెంచరీలు కూడా చేశాడు.





























