AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin Tendulkar’s post: అంపైర్ స్టీవ్ బక్నర్ కి గూగ్లీ విసిరిన సచిన్

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో సరదాగా ఓ ఫొటో షేర్ చేశాడు. మూడు పెద్ద చెట్ల ముందు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ, "ఈ చెట్లను స్టంప్స్‌గా భావించిన అంపైర్ ఎవరో గుర్తించగలరా?" అని ప్రశ్నించాడు. అభిమానులు వెంటనే ఈ ప్రశ్నను స్టీవ్ బక్నర్‌కి అన్వయిస్తూ, సచిన్‌పై ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు.

Sachin Tendulkar's post: అంపైర్ స్టీవ్ బక్నర్ కి గూగ్లీ విసిరిన సచిన్
Steve Bucknor Sachin Tendulkar
Narsimha
|

Updated on: Nov 17, 2024 | 8:09 PM

Share

లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మూడు పెద్ద చెట్ల ముందు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్న తన ఫొటోను షేర్ చేస్తూ, “ఈ చెట్లను పెద్ద స్టంప్స్‌గా భావించిన అంపైర్ ఎవరో గుర్తించగలరా?” అని సరదాగా ప్రశ్నించాడు.

ఈ ప్రశ్న చూసిన అభిమానులకు వెంటనే గుర్తొచ్చింది వెస్టిండీస్ కు చెందిన అంపైర్ స్టీవ్ బక్నర్ పేరు. బక్నర్ తన తప్పుడు నిర్ణయాలతో సచిన్ టెండూల్కర్‌ ని చాలా నాటౌట్ అయినా అనవసరంగా ఔట్ ఇచ్చాడనే ఆరోపణలు గతంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు అభిమానులు బక్నర్ నిర్ణయాల కారణంగా సచిన్ అనేక కీలక ఇన్నింగ్స్‌లో ఔట్ అయ్యాడని గుర్తుచేస్తూ మీమ్స్, వీడియో క్లిప్స్ పంచుకున్నారు.

2003 గబ్బా టెస్టులో జాసన్ గిల్లెస్పీ వేసిన బంతి సచిన్ ప్యాడ్‌లను తాకినప్పుడు బౌన్స్ ఎక్కువగా అయింది. అది అవుట్ కాకపోయిన బక్నర్ ఎల్‌బీడబ్ల్యూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.  2005 పాకిస్థాన్ తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టులో సచిన్ బ్యాట్‌ను అసలు తాకని బంతిని బక్నర్ క్యాచ్ అవుట్‌గా ప్రకటించాడు.

రిటైర్మెంట్ తరువాత బక్నర్ ఈ విషయాలపై స్పందిస్తూ, “టెండూల్కర్‌ను రెండు సార్లు తప్పుగా ఔట్ ఇచ్చాను. మనిషి తప్పులు చేయడం సహజం, కానీ అవి నాకు మిగిలిపోయాయి” అని చెప్పాడు. భారతదేశంలో జరిగిన ఒక మ్యాచ్ సందర్భంగా, ఈడెన్ గార్డెన్స్‌లో 100,000 మంది అభిమానుల మధ్య తీసుకున్న నిర్ణయాలు ఒత్తిడి వల్ల తప్పుకి దారితీశాయని అంగీకరించాడు. తన తప్పులను గుర్తించానని వాటి పట్ల భాదపడినట్లు తెలిపిన బక్నర్.. అలాంటివన్న అంపైర్ జీవితంలో భాగమని అభిప్రాయపడ్డాడు.

కాగా తాజాగా సచిన్ చేసిన పోస్ట్ అభిమానుల్లో నవ్వులు పుట్టించడమే కాదు, గతంలో తాలుకూ వివాదాలను మరోసారి గుర్తుచేసేలా చేసింది. అభిమానులు స్టీవ్ బక్నర్‌ను గుర్తు చేస్తూ కామెంట్లు పెట్టారు. అప్పట్లో తన తప్పుడు నిర్ణయాలతో సచిన్ అవుట్ చేశాడని… ఇప్పుడు దానికి సచిన్ స్వీట్ రిప్లై ఇచ్చాడని ఒకరు కామెంట్ పెట్టగా.. మరొకరు అంపైర్ స్టీవ్ బక్నర్ కి సచిన్ గూగ్లీ విసిరి ఔట్ చేశాడని మరోకరు కామెంట్ చేశారు. ఇక మాజీ క్రికెటర్.. ఆకాశ్ చోప్రా కూడా బక్నర్ పేరు తీసుకొస్తూ సరదాగా ట్వీట్ చేశారు. సచిన చేసిన ఆ ట్వీట్ క్రికెట్ అభిమానులను గతంలోకి తీసుకెళ్లింది. అంతేకాదు అంపైర్లపై నిర్ణయాలు ఖచ్చితత్వంతో ఉండాల్సిన అవసరముందని.. ఈ విషయంలో టెక్నాలజీ పాత్రను గురించి చర్చలు మొదలయ్యాయి.