AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus: జాక్‌పాట్ కొట్టిన తెలుగు కుర్రాడు.. ఎంట్రీ ఫిక్స్ అయినట్టే..!

బంగ్లాదేశ్‌తో టీ20లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆల్ రౌండర్ తెలుగు తేజం ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగే తొలి టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. WTC ఫైనల్స్‌కు చేరుకోవాలంటే భారత్ ఈ సిరీస్‌ను 4-1తో గెలవాలి. కాబట్టి ఈ సిరీస్ భారత్‌కు డూ ఆర్ డై అని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఆడడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 

Ind vs Aus: జాక్‌పాట్ కొట్టిన తెలుగు కుర్రాడు.. ఎంట్రీ ఫిక్స్ అయినట్టే..!
Nitish Kumar Reddy May Get Chance To Make Debut In Aus Vs Ind 1st Test
Velpula Bharath Rao
|

Updated on: Nov 17, 2024 | 9:23 PM

Share

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించి ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమైనది. WTC ఫైనల్స్‌కు చేరుకోవాలంటే భారత్ ఈ సిరీస్‌ను 4-1తో గెలవాలి. కాబట్టి ఈ సిరీస్ భారత్‌కు డూ ఆర్ డై అని చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఆడడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కాబట్టి రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పెర్త్ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

నితీష్ కుమార్ రెడ్డిని నాలుగో బౌలర్‌గా తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. పెర్త్‌లోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. అందువల్ల టీమ్ ఇండియా బౌలింగ్ పక్షం మరింత పటిష్టంగా ఉండాలని, చివరి వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండేలా చూడాలని ఇరువర్గాలను పరిగణలోకి తీసుకుని నితీష్‌ను చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. నితీశ్ 3 టీ20ల్లో 1 హాఫ్ సెంచరీతో 90 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. నితీష్ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా, నితీష్ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 779 పరుగులు చేశాడు. నితీష్ 56 వికెట్లు కూడా తీశాడు. ఒక మ్యాచ్‌లో 119 పరుగులకు 8 వికెట్లు పడగొట్టడం నితీష్ అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు.

తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, అలెక్స్ కారీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లీష్ మరియు జోష్ హాజిల్‌వుడ్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీం ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ( వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్

మరన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి