
South Africa vs New Zealand, 2nd Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు న్యూజిలాండ్ 363 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. ఈ టోర్నమెంట్‌లో ఇదే అత్యధిక మొత్తం. మునుపటి రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌పై 356 పరుగులు చేసింది.
రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలు చేయగా, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీలు చేయలేకపోయారు. ఇద్దరూ తలో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా తరపున లుంగి ఎన్గిడి 3 వికెట్లు పడగొట్టాడు. రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. వేన్ ముల్డర్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
ICC ODI టోర్నమెంట్లలో అత్యధిక స్కోర్లు (నాకౌట్లలో నమోదైనవి)
397/4 – IND vs NZ, ముంబై, CWC 2023 SF
393/6 – NZ vs WI, వెల్లింగ్టన్, CWC 2015 QF
362/6 – NZ vs SA, లాహోర్, CT 2025 SF
359/2 – AUS vs IND, జోహన్నెస్‌బర్గ్, CWC 2003 ఫైనల్
338/4 – PAK vs IND, ది ఓవల్, CT 2017 ఫైనల్
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోర్లు..
362/6 – NZ vs SA, లాహోర్, 2025 SF
351/8 – ENG vs AUS, లాహోర్, 2025 (ఓటమి)
347/4 – NZ vs USA, ది ఓవల్, 2017
338/4 – PAK vs IND, ది ఓవల్, 2017 ఫైనల్
331/7 – IND vs SA, కార్డిఫ్, 2013
రెండు జట్ల ప్లేయింగ్-11..
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, లుంగి న్గిడి.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓ’రూర్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..