Asian Games 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. నేపాల్‌పై ఘన విజయం.. మెరిసిన యశస్వీ, బిష్టోయ్..

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో టోర్నీలో దూకుడు ప్రదర్శిస్తున్న నేపాల్‌కి తన తొలి మ్యాచ్‌లోనే అడ్డుకట్ట వేసింది. మంగళవారం జరిగిన ఏషియన్ గేమ్స్ మెన్స్ టీ20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ చేధించలేకపోయింది. దీంతో నేపాల్‌పై రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని..

Asian Games 2023: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. నేపాల్‌పై ఘన విజయం.. మెరిసిన యశస్వీ, బిష్టోయ్..
India Vs Nepal, Asian Games 2023

Updated on: Oct 03, 2023 | 10:15 AM

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్టు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో టోర్నీలో దూకుడు ప్రదర్శిస్తున్న నేపాల్‌కి తన తొలి మ్యాచ్‌లోనే అడ్డుకట్ట వేసింది. మంగళవారం జరిగిన ఏషియన్ గేమ్స్ మెన్స్ టీ20 క్రికెట్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్ ఇచ్చిన 203 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ చేధించలేకపోయింది. దీంతో నేపాల్‌పై రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ విజయంతో భారత్ సెమీఫైనల్స్‌కి చేరుకోగా.. నేపాల్ ఇంటి బాట పట్టింది. నేపాల్ తరఫున దీపేందర్ సింగ్(32), సున్దీప్ జోరా(29), కుశల్ మల్ల(29), కుశల్ భూర్తల్(28), కరణ్ కేసీ(18*) పర్వాలేదనిపించినా.. పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అవేష్ ఖాన్ 3, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకోగా..సాయి కిషోర్ ఓ వికెట్ పడగొట్టాడు.

అంతకముందు టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు‌గా వచ్చిన యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గౌక్వాడ్ శుభారంభాన్ని అందించారు. యశస్వీ(100) తొలి టీ20 సెంచరీ నమోదు చేసుకోగా.. రుతురాజ్ 25 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన తిలక్ వర్మ(2), జితేశ్ శర్మ(5) విఫలమైనా.. శివమ్ దుబే(19 బంతుల్లో 25), రింకూ సెంగ్(15 బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నేపాలీ బౌలర్లలో దీపేంద్ర సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్ కమి, సందీప్ లమిచ్చనే చెరో వికెట్ తీసుకున్నారు.

కాగా, టీ20 ర్యాకింగ్స్ ద్వారా ఆసియా క్రీడల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడిన భారత్.. నేటి విజయంతో సెమీ ఫైనల్స్‌కి చేరింది. ఆసియా క్రీడల క్రికెట్ సెమీ ఫైనల్స్ అక్టోబర్ 6న జరగనుండగా.. ఫైనల్ అక్టోబర్ 7న జరగనుంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

నేపాల్ ప్లేయింగ్ ఎలెవన్: కుశల్ భుర్తేల్, ఆసీఫ్ షేక్ (వికెట్ కీపర్), సున్దీప్ జోరా, గుల్సన్ ఝా, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ మల్ల, దీపేంద్ర సింగ్, సోంపాల్ కమి, కరణ్ కేసీ, అబినాష్ బోహారా, సందీప్ లమిచ్చనే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..