సుమారు ఐదున్నర నెలల నిరీక్షణ తర్వాత, ఐపీఎల్ 2022(IPL 2022) సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో భాగంగా గత సీజన్‌లో చివరి మ్యాచ్ ఆడిన రెండు దిగ్గజ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం మార్చి 26న కొత్త సీజన్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్(CSK vs KKR)తో ఢీకొడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆరంభం ఎవరూ ఊహించని విధంగా ఉంది. గత సీజన్‌లో తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించిన యువ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, కొత్త సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో కేవలం మూడు బంతుల్లోనే పెవిలియన్ చేరాడు. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన బౌలర్ చేతిలో ఔటయ్యాడు.
ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ చెన్నై టీం పాలిట యముడిలా మారాడు. ఉమేష్ యాదవ్(Umesh Yadav) దెబ్బకు చెన్నై టీం బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. తొలి ఓవర్‌లోనే రుతురాజ్‌ను పెవిలియన్ చేర్చిన ఉమేష్.. 4.1 ఓవర్లలో కాన్వే(3)ను ఔట్ చేశాడు. దీంతో చెన్నై టీం 28 పరుగులకు 2వ వికెట్‌ను కోల్పోయింది.
సుమారు 4 సంవత్సరాల తర్వాత KKRకి తిరిగి వచ్చిన ఉమేష్ యాదవ్.. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్‌కు దింపాడు. వాంఖడే స్టేడియంలోని ఫాస్ట్ బౌలర్ల సహాయక పిచ్‌పైకి వచ్చిన వెంటనే ఉమేష్ యాదవ్.. తన వేగం, కష్టమైన బౌన్స్‌లతో విధ్వంసాన్ని చూపించాడు. మ్యాచ్‌లో తొలి బంతికే ఉమేష్ బౌలింగ్ చేసినా.. ఆ తర్వాత తన సత్తా చాటాడు.
Also Read: IPL 2022: ప్రారంభమైన క్రికెట్ పండగ.. టాస్ గెలిచిన కోల్‌కతా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?
PBKS vs RCB IPL 2022 Match Prediction: పంజాబ్, బెంగళూరు భవితవ్యాలను కొత్త కెప్టెన్లు మార్చేనా?