
Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో నేడు మళ్లీ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య రోజు మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు టీం తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శాంసన్ సేన ముందుగా బౌలింగ్ చేయనుంది.
జైపూర్‌లో రాజస్థాన్, బెంగళూరు మధ్య ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లు రాజస్థాన్, మూడు మ్యాచ్‌లు బెంగళూరు గెలుపొందాయి. రాజస్థాన్‌పై బెంగళూరు ఈ మైదానంలో గత 10 ఏళ్లుగా గెలవలేదు. 2013లో ఇక్కడ చివరి విజయం సాధించింది.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.
ఇరుజట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ,కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..