Royal Challengers Bangalore Vs Rajasthan Royals: ఆర్సీబీ కల చెదిరింది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న ఆ జట్టు ఆశ నెరవేరలేదు. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ లో పరాజయం పాలైంది. బుధవారం (మే 22) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (34) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైస్వాల్ (45), పరాగ్ (36), హెట్‌మయర్ (26) రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్ ఫైనల్ బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
All is 𝙒𝙚𝙡𝙡 when Po𝙒𝙚𝙡𝙡 is there 😎
Rajasthan Royals ease out the nerves with a 4️⃣ wicket victory 🩷
With that, they move forward in the quest for glory 🙌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/brrzI8Q3sZ
— IndianPremierLeague (@IPL) May 22, 2024
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, నాంద్రే బర్గర్, షిమ్రాన్ హెట్మేయర్, తనుష్ కోటియన్
𝗗𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝗱! 🫣
Captain Sanju Samson is stumped off a wide delivery ☝️
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/e0G6MhVu18
— IndianPremierLeague (@IPL) May 22, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..