
Rovman Powell IPL 2024 Auction Price: ఈ రోజు తొలి ఆటగాడిగా వేలంలోకి వచ్చిన వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్.. రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటాపోటీ బిడ్డింగ్ వార్‌లోకి ప్రవేశించింది. రోవ్‌మన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. కానీ, అతను ఇక్కడ జాక్‌పాట్ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసింది.
జమైకాకు చెందిన పవర్ ఫుల్ ఆల్-రౌండర్, రోవ్‌మాన్ పావెల్ పరిమిత ఓవర్ల ఆటగాడిగా తనకంటూ చాలా పేరు సంపాదించుకున్నాడు. పేద కుంటుంబం నుంచి వచ్చిన పావెల్ కింగ్‌స్టన్‌లో అతని తల్లి వద్ద పెరిగాడు. భారీ-హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను 2015 ప్రారంభంలో తన లిస్ట్-A అరంగేట్రం చేశాడు. అతని మొదటి గేమ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పుడు పావెల్ కెరీర్ వేగం పుంజుకుంది. అనంతరం ఏడాది తర్వాత, అతను జింబాబ్వేలో ODI ట్రై-సిరీస్‌కు ఎంపికయ్యాడు. పావెల్‌ను మొదట కోల్‌కతా నైట్ రైడర్స్ 2018లో కొనుగోలు చేసింది. కానీ, అతను ఒక గేమ్‌లో కనిపించలేదు. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ వివిధ T20 లీగ్‌లలో అద్భుతమైన ప్రదర్శనల తర్వాత పావెల్‌ను INR 2.8 కోట్లకు తీసుకుంది.
ఐపీఎల్ మనీ వేలం 2024 లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..