Rohit Sharma: హిట్‌మ్యాన్‌కు హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ బర్త్‌ డే గిఫ్ట్‌.. ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్‌

|

Apr 30, 2023 | 5:30 PM

సుమారు 15 ఏళ్ల క్రితం ఓ సాధారణ క్రికెటర్‌గా కెరీర్‌ ను ప్రారంభించి నేడు టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు రోహిత్‌ శర్మ. నిలకడ లేదు, ఓపిక తక్కువ అనే విమర్శలు, అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. తనదైన ఆటతీరుతో సచిన్‌, గంగూలీ, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లీలతో సమానంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

Rohit Sharma: హిట్‌మ్యాన్‌కు హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ బర్త్‌ డే గిఫ్ట్‌.. ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్‌
Rohit Sharma
Follow us on

సుమారు 15 ఏళ్ల క్రితం ఓ సాధారణ క్రికెటర్‌గా కెరీర్‌ ను ప్రారంభించి నేడు టీమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు రోహిత్‌ శర్మ. నిలకడ లేదు, ఓపిక తక్కువ అనే విమర్శలు, అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. తనదైన ఆటతీరుతో సచిన్‌, గంగూలీ, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లీలతో సమానంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ హిట్‌మ్యాన్‌గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ టీమిండియా కెప్టెన్‌కు బోలెడు ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ టోర్నీకి ప్రాతినిథ్యం వహిస్తోన్న రోహిత్ ఇవాళ (ఏప్రిల్‌30) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దీంతో రోహిత్‌కు సోషల్‌మీడియా వేదికగా క్రికెటర్లతో పాటు అభిమానులు, నెటిజన్లు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌ పుట్టిన రోజును హైదరాబాద్‌లో అభిమానులు గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్‌ శర్మ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద కటౌట్‌ పెట్టిన దాఖలాలు లేవు.

తాజాగా హిట్‌మ్యాన్‌ బర్త్‌డే స్పెషల్‌ ముంబై ఇండియన్స్‌ ఈ ఫొటోను తమ అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కాగా రోహిత్‌ స్వస్థలం ముంబై అయినప్పటికీ హైదరాబాద్‌లో మంచి అనుబంధం ఉంది. గతంలో ఐపీఎల్‌ ఆరంభ సీజన్లలో రోహిత్‌ శర్మ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. అంతేకాదు 2009లో ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు హిట్‌ మ్యాన్‌. ఈక్రమంలోనే అతనికి జంట నగరాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత ముంబై జట్టుకు మారిపోయిన రోహిత్‌ ఐదుసార్లు తన జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..