AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ జెర్సీని ఫ్రేమ్‌ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్.. ఎవరో తెలుసా?

. పాక్‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతుండగా దయచేసి 'మా దేశంలో ఒక్క మ్యాచైనా ఆడండి కోహ్లీ' అని ఫ్యాన్స్‌ ప్లకార్డులు పట్టుకుని రిక్వెస్ట్ చేసిన సంఘటనలు కోకొల్లలు. టన్నుల కొద్దీ పరుగుల వర్షం కురిపిస్తోన్న విరాట్‌ అంటే సామాన్యులే కాదు నేటి తరం క్రికెటర్లు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ రోల్‌ మోడల్‌గా భావిస్తారు.

Virat Kohli: కోహ్లీ జెర్సీని ఫ్రేమ్‌ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్న స్టార్‌ క్రికెటర్.. ఎవరో తెలుసా?
Virat Kohli
Basha Shek
|

Updated on: Apr 30, 2023 | 4:28 PM

Share

టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీకి మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ అభిమానులున్నారు. అంతెందుకు మన దాయాది దేశమైన పాకిస్తాన్‌లో అయితే కోహ్లీకి సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. పాక్‌ క్రికెట్‌ మ్యాచులు జరుగుతుండగా దయచేసి ‘మా దేశంలో ఒక్క మ్యాచైనా ఆడండి కోహ్లీ’ అని ఫ్యాన్స్‌ ప్లకార్డులు పట్టుకుని రిక్వెస్ట్ చేసిన సంఘటనలు కోకొల్లలు. టన్నుల కొద్దీ పరుగుల వర్షం కురిపిస్తోన్న విరాట్‌ అంటే సామాన్యులే కాదు నేటి తరం క్రికెటర్లు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ రోల్‌ మోడల్‌గా భావిస్తారు. ఈక్రమంలో బంగ్లాదేశ్‌ స్టార్ క్రికెటర్‌ కోహ్లీ జెర్సీని ఫ్రేమ్‌ కట్టించుకుని మరీ ఇంట్లో దాంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇంతకీ కోహ్లీ జెర్సీని ఫ్రేమ్‌ కట్టించుకోని ఇంట్లో పెట్టుకున్న ఆ స్టార్‌ క్రికెటర్‌ ఎవరో తెలుసా? గతేడాది బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లిన టీమిండియాపై ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌ చేసి ఆకట్టుకున్న మెహిదీ హసన్‌ మిరాజ్‌.

గ్రేటెస్ట్ బ్యాటర్‌ కదా..

గతేడాది బంగ్లా టూర్‌కు వెళ్లిన భారత్‌పై అద్భుతంగా రాణించాడు మిరాజ్‌. వన్డే సిరీస్‌, టెస్ట్‌ సిరీస్‌లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతాలు సృష్టించాడు. పటిష్ఠమైన భారత్‌ జట్టుపై బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ను 2-1తో తేడాతో గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం ఈ మెహిదీ హసన్‌ అని చెప్పుకోవచ్చు. మొదటి వన్డేలో బంగ్లాదేశ్‌ 139 పరుగులకే 9 వికెట్లు కోల్పోయినా.. అద్భుతంగా ఆడి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత రెండో వన్డేలో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. అదికూడా 8వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి. ఇక బౌలింగ్‌లోనూ రాణించి మూడు వన్డేల్లో 4 వికెట్లు పడగొట్టాడు.ఇక టెస్టు సిరీస్‌లోనూ మొదటి టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు. అలాగే రెండో టెస్టులోనూ మెహిదీ 6 వికెట్లు సాధించాడు. అందులో విరాట్ కోహ్లీ వికెట్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ సైతం…

అందుకే ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్న మిరాజ్‌కు తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దాన్ని ఎంతో అపురూపంగా భావించిన మెహిదీ.. గ్రేటెస్ట్‌ బ్యాటర్‌ నుంచి ప్రత్యేకమైన బహుమతి అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని తన ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఇప్పుడు ఆ జెర్సీనే ఫ్రేమ్‌ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌. టీవీ పైన ఒక వైపు విరాట్‌ కోహ్లీ జెర్సీ మరోవైపు మెహెదీ జెర్సీ ఉన్న ఫొటోలు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us