- Telugu News Sports News Cricket news Rohit sharma win all three test match as indian captain he win his 3rd match against aus in nagpur
IND vs AUS: ఫార్మాట్ ఏదైనా సరే.. ప్రత్యర్థుల గూబ గుయ్యిమనాల్సిందే.. హిట్‌మ్యాన్ గణాంకాలు చూస్తే వారికి కన్నీళ్లే..
Rohit Sharma Nagpur Test: నాగ్‌పూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Updated on: Feb 11, 2023 | 8:34 PM

Rohit Sharma Stats As Test Captain: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడాడు. కాగా, ఇప్పటివరకు రోహిత్ శర్మ 3 టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు.

రోహిత్ శర్మ తొలిసారిగా 2022 మార్చిలో భారత టెస్టు జట్టుకు బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీమిండియా 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. లంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.

తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయాల శాతం 100 శాతానికి చేరింది. ఆడిన మూడు టెస్టుల్లోనూ విజయాలు సాధించాడు.

మార్చి, 2022లో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆ తర్వాత శ్రీలంకను 228 పరుగుల తేడాతో ఓడించాడు. ఇక ఫిబ్రవరి 2023లో ఆస్ట్రేలియాను కూడా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించాడు. 100 శాతం విజయాలతో రోహిత్ దూసుకపోతున్నాడు.

టెస్టులే కాకుండా వన్డేలు, టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ గణాంకాలు చాలా బాగున్నాయి. ఇప్పటివరకు మొత్తం 24 ODIల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో భారతదేశం 19 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం 5 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

ఇక టీ20 ఇంటర్నేషనల్‌లో మొత్తం 51 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత జట్టు 39 మ్యాచ్‌లు గెలిచి, 12 మ్యాచ్‌లలో ఓడిపోయింది.




