World Cup 2023 Captains: 13వ ట్రోఫీపై కన్నేసిన 10మంది సారథులు.. రికార్డులు, బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?

|

Sep 30, 2023 | 9:40 AM

ICC ODI World Cup 2023 Captains Records: అక్టోబర్ 5 నుంచి క్రికెట్ మహా సమరం ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో ఈ వన్డే ప్రపంచ కప్ 2023 పోరు షురూ కానుంది. ఈసారి మొత్తం 10 జట్లు తమ పూర్తి బలాన్ని ఉపయోగించుకునేందుకు బరిలోకి దిగనున్నాయి. అంతకుముందు ఈసారి బరిలో నిలిచిన 10 మంది సారథులను, వారి రికార్డులను తెలుసుకుందాం..

World Cup 2023 Captains: 13వ ట్రోఫీపై కన్నేసిన 10మంది సారథులు.. రికార్డులు, బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయంటే?
Icc World Cup 2023
Follow us on

World Cup 2023 Captains: ODI ప్రపంచ కప్ 2023 భారతదేశం ఆతిథ్యమిస్తుంది. అక్టోబర్ 5 నుంచి క్రికెట్ వన్డే మహా సమరం మొదలుకానుంది. కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈసారి మొత్తం 10 జట్లు తమ పూర్తి బలాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 10 జట్ల కెప్టెన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. 36 ఏళ్ల రోహిత్ 251 వన్డేల్లో 10112 పరుగులు చేశాడు. ఓపెనింగ్‌లో ప్రత్యర్థి బౌలర్ల తాట తీసిన రోహిత్.. 52 టెస్టుల్లో 3677 పరుగులు, 148 టీ20 మ్యాచుల్లో 3853 పరుగులు చేశాడు.

గత ప్రపంచ కప్ 2019 ఛాంపియన్ ఇంగ్లాండ్ కమాండ్ 33 ఏళ్ల జోస్ బట్లర్ చేతిలో ఉంది. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ బట్లర్ ఓపెనింగ్‌లో రచ్చ చేశాడు. ఇప్పటి వరకు 169 వన్డే మ్యాచ్‌లు ఆడి 4823 పరుగులు చేశాడు. అతని పేరు మీద 11 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈసారి టైటిల్ కోసం బలమైన పోటీదారులలో ఇంగ్లండ్ ఒకటిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ప్రతి క్రికెట్ అభిమానికి కూడా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలుసు. గత ప్రపంచ కప్ 2019లో న్యూజిలాండ్ ఫైనల్ ఆడింది. అందులో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి విలియమ్సన్ తన జట్టు టైటిల్ గెలవాలనే ఉద్దేశ్యంతో రంగంలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకు 161 వన్డే మ్యాచ్‌లు ఆడి 6554 పరుగులు చేశాడు.

పాకిస్థాన్ జట్టు కమాండ్ 28 ఏళ్ల బాబర్ అజామ్ చేతిలో ఉంది. బాబర్‌తో సహా చాలా మంది పాకిస్థానీ ఆటగాళ్లు తొలిసారి భారత్‌కు వచ్చారు. బాబర్ ఇప్పటివరకు 108 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 19 సెంచరీల సహాయంతో 5409 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా జట్టు కమాండ్ టెంబా బావుమా చేతిలో ఉంది. 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ బావుమా మిడిల్ ఆర్డర్‌లోకి ప్రవేశించి జట్టుకు బలాన్ని అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 30 వన్డేల్లో 1367 పరుగులు చేశాడు. బావుమా 56 టెస్టుల్లో 2997 పరుగులు, 36 టీ20 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేశాడు.

అత్యధిక సార్లు, 5 సార్లు ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఈసారి పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కంగారూ జట్టు చివరిసారిగా 2015లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 30 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ కమిన్స్ ఇప్పటివరకు 77 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 126 వికెట్లు పడగొట్టాడు.

బంగ్లాదేశ్ జట్టు కమాండ్ స్పిన్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ చేతిలో ఉంది. షకీబ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వెన్నుముఖగా నిలిస్తున్నాడు. అతను 240 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో 7384 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 308 వికెట్లు తీశాడు.

నెదర్లాండ్స్ జట్టు కెప్టెన్సీ 27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ చేతిలో ఉంది. అతను ఇప్పటివరకు 38 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 1212 పరుగులు చేశాడు.

శ్రీలంక జట్టుకు 32 ఏళ్ల దసున్ షనక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ షనక మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఇప్పటివరకు 67 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 1204 పరుగులు చేశాడు. షనక 27 వికెట్లు తీశాడు.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు కెప్టెన్సీ హష్మతుల్లా షాహిదీ చేతిలో ఉంది. 28 ఏళ్ల షాహిదీ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అతను ఇప్పటివరకు 64 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 1775 పరుగులు చేశాడు. షాహిద్‌ కూడా ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..