Rohit Sharma Trolled: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. ఫిట్‌నెస్ విషయంలో గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రోహిత్‌పై సెటైర్లు సందిస్తున్నారు నెటిజన్లు . రోహిత్ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు కారణం ఇదేనా.. తనకు ఆట కంటే వడాపావ్ తినడమే ముఖ్యం’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ మేరకు స్పందిస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటించిన విషయం విదితమే.
I wonder why people troll him for eating..The poor guy has to hide his food and eat in a very uncomfortable manner even after achieving so much. He doesn’t deserve this. https://t.co/lmko6e05f1
— Sagar (@sagarontheright) March 15, 2021
ఈ క్రమంలో హిట్‌మ్యాన్ గైర్హాజరీలో మొదటి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో అంతకు అంతా బదులు తీర్చుకుంది. మోర్గాన్ సేనపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ సందర్భంగా, బెంచ్ మీదున్న రోహిత్ ఏదో తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సపోర్టు సిబ్బంది వెనుక కూర్చున్న రోహిత్ దాక్కొని తింటూ కనిపించాడు. చాటుగా తింటున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. తోటి ఆటగాళ్లు కష్టపడుతుంటే, నువ్వేంటి ఇలా రోహిత్ అంటూ… కామెంట్ చేస్తున్నారు. అయితే, రోహిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని కొందరు అంటున్నారు. కానీ కావాలనే ఈ స్టార్ ఓపెనర్‌ను తప్పించి కోహ్లి ‘గేమ్స్’ ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్ చేయడం ఏమిటని మండిపడుతున్నారు.