AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: ఆ మ్యాచ్‌ సందర్భంగా టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయాను: రోహిత్ శర్మ

భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్‌ నిర్వహిస్తున్న "హూ ఈజ్ ది బాస్" అనే ప్రోగ్రాంలో స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అభిమానులతో పంచుకున్న కొన్ని సరదా విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ షోలో రోహిత్‌ మాట్లాడుతూ.. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్‌గా ఉన్న తాను టాస్‌ గెలిచిన తర్వాత ఏం ఎంచుకోవాలో అనే దానిని మర్చిపోయినట్టు తెలిపారు. అయినప్పటికే ఆ మ్యాచ్‌ గెలవడంతో గండం గట్టెక్కానని చెప్పుకొచ్చాడు.

Rohit Sharma: ఆ మ్యాచ్‌ సందర్భంగా టాస్ గెలిచి ఏం ఎంచుకోవాలో మర్చిపోయాను: రోహిత్ శర్మ
Rohith
Anand T
|

Updated on: Jun 22, 2025 | 10:06 PM

Share

భారత స్టార్‌ ప్లేయర్, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ సన్నివేశాలను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల భారత మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్‌ నిర్వహిస్తున్న “హూ ఈజ్ ది బాస్” అనే ప్రోగ్రాంలో భారత్‌ స్టార్‌ ప్లేయర్, హిట్‌ మ్యాచ్‌ రోహిత్‌ శర్మ పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాం సందర్భంగా రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో జరిగిన ఓ సరదా సంఘటన గురించి వివరిస్తూ, 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్‌టీ20) మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్‌గా ఉన్న తాను టాస్‌ వెలుసుకోవడానికి వెళ్లానని.. అయితే టాస్‌ గెలిచిన తర్వాత తాను బ్యాటింగ్‌ తీసుకున్నానని తెలిపాడు.

అయితే నిజానికి టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్ చేయాలని టీమంతా మాట్లాడి ముందే నిర్ణయం తీసుకున్నామని.. తాను బ్యాంటింగ్‌ ఎంచుకోవడంతో,.. కోచ్ అనిల్ కుంబ్లే తన దగ్గరకు వచ్చి, రోహిత్ ఏంటి ఇలా చేశావ్? అని అడిగినట్టు తెలిపారు. అప్పుడు దానికి సమాధానంగా రోహిత్‌ తనకు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనిపించిందని.. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా’ అని అనిల్‌ కుంబ్లేకి తెలిపినట్టు చెప్పారు.

అయితే నిజానికి టాస్‌ వేసుకునేందుకు వెళ్లిన తాను టాస్‌ గెలిచిన తర్వాత ఏం ఎంచుకోవాలనే విషయాన్ని మర్చిపోయానని.. అందుకే పొరపాటున అలా చెప్పేశానని చెప్పుకొచ్చాడు. అయితే తాను మర్చిపోయి బ్యాటింగ్‌ ఎంచుకున్నప్పటికీ ఆ మ్యాచ్‌లో గెలిచామని దాంతో.. తన మనస్సు కుదుటపడిందని రోహిత్ నవ్వుతూ చెప్పారు. అయితే ఈ షోలో రోహిత్ అభిమానులతో పంచుకున్న విషయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిని చూసి రోహిత్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..