Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు రోహిత్ శర్మ రెడీ.. జస్ట్ 38 చాలు భయ్యో.. అదేంటంటే?
Rohit Sharma Records in India vs New Zealand 2nd ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే రాజ్‌కోట్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ భారీ రికార్డ్ నెలకొల్పే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో బుధవారం (జనవరి 14) జరగనున్న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లో రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశముంది.
జాక్వెస్ కల్లిస్ రికార్డుపై కన్నేసిన రోహిత్..
వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు 280 వన్డేల్లో 272 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్, 49.11 సగటుతో మొత్తం 11,542 పరుగులు చేశాడు. ఈ రెండో వన్డేలో రోహిత్ మరో 38 పరుగులు చేస్తే, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్ రౌండర్ జాక్వెస్ కల్లిస్ (11,579 పరుగులు) రికార్డును అధిగమిస్తాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదవ ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు.
రాహుల్ ద్రవిడ్ రికార్డుకు చేరువలో..
కేవలం పరుగులే కాదు, హాఫ్ సెంచరీల విషయంలోనూ రోహిత్ ఒక ముఖ్యమైన మైలురాయికి దగ్గరగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌తో (95 హాఫ్ సెంచరీలు) సమానంగా ఎనిమిదో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 94 యాభై ప్లస్ స్కోర్లు ఉన్నాయి.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలు రోహిత్ కంటే ముందున్నారు.
రాజ్ కోట్ సవాల్..
వడోదరలో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ శర్మ 26 పరుగులకే వెనుదిరిగినప్పటికీ, భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే, రాజ్‌కోట్ స్టేడియంలో టీమ్ ఇండియా రికార్డు 2020 నుంచి అంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ తన వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎల్ రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ఆయుష్ బదోని.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




