AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohith Sharma: రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్ రోహిత్.. టీ20ల్లో 400 సిక్సర్లు..

టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. రోహిత్‌ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్‌ రైనా, 320 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి, 304 సిక్సర్లతో ఎంఎస్‌ ధోని తర్వాతి స్థానాల్లో ఉన్నారు...

Rohith Sharma: రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్ రోహిత్.. టీ20ల్లో 400 సిక్సర్లు..
Rohith
Srinivas Chekkilla
|

Updated on: Oct 06, 2021 | 2:32 PM

Share

టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. రోహిత్‌ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్‌ రైనా, 320 సిక్సర్లతో విరాట్‌ కోహ్లి, 304 సిక్సర్లతో ఎంఎస్‌ ధోని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‎తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్‌లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్‌ గేల్‌ ప్రథమ స్థానంలో ఉన్నాడు

ముంబై ఇండియన్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్తాన్ రాయల్స్‎తో తప్పక గెలవాల్సి ఉంది. దీంతో సమిష్టిగా ఆడిన జట్టు రాయల్స్‎పై విజయం సాధించింది. ఇషాన్‌ కిషన్‌ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన రాజస్తాన్‌ ముంబై బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్‌, చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకి ఇషాన్‌ కిషన్‌ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్‌ ప్లేఆప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచులు ఆడిన ఏడు మ్యాచుల్లో ఓడిపోయి.. ఆరింటిలో విజయం సాధించింది. 12 పాయింట్లతో జాబితాలో ఐదో స్థానంలో నిలించింది.

Read Also.. RCB vs SRH, IPL 2021 Match Prediction: ఒకరిది ఆత్మగౌరవం.. మరొకరిది విజయకాంక్ష.. గెలుపు మాత్రం ఫిక్స్..