IPL 2021 RCB vs SRH Match Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Highlights: ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి.
Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad Highlights: ఐపీఎల్ 2021 లీగ్ మ్యాచ్‌లు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా జట్లు టాప్ 4 నిలిచాయి. అయితే, ఇవాళ అబుదాబీలోని షేక్ జాయద్ స్లేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో టాప్ 3లో ఉన్న బెంగళూరు జట్టుతో చివరన ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనుంది.
టాస్ గెలిచిన కోహ్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ మొదటగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఓపెనర్లుగా జాసన్ రాయ్, అభిషేక్ వర్మ క్రీజులోకి అడుగుపెట్టారు. 13 పరుగులకే అభిషేక్ ఔటైనా రాయ్ మాత్రం తనదైన శైలిలో అలరించాడు. 38 బంతుల్లో 44 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్ విలియమ్‌సన్ 29 బంతుల్లో 31 పరుగులు మినహాయించి పెద్దగా ఎవరూ రాణించలేదు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, క్రిస్టియన్ 2 వికెట్లు, జార్జ్ ఒక వికెట్ సాధించారు.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కోహ్లీ నిరుత్సాహపరిచిన దేవదత్ పాడికల్ పర్వాలేదనిపించాడు. 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. తర్వాత వరుసగా రెండు వికెట్లు పడిపోయినా క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ తనదైన శైలిలో సన్ రైజ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు మూకుమ్మడిగా ఒత్తిడి పెంచడంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. ఈ క్రమంలో క్రీజులో ఏబీ డివిలియర్స్ , జార్జ్ ఉన్నారు. కానీ 8 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కేది కానీ ఆ మ్యాజిక్ జరగలేదు. ఇక సన్‌రైజర్స్ బౌలర్లు తల వికెట్ సాధించారు.
జట్ల వివరాలు..: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు: విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భారత్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, షహబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ మరియు మహ్మద్ సిరాజ్.
సన్ రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, సాహా, కేన్ విలియమ్సన్ (సి), ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ/సిద్దార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్
LIVE Cricket Score & Updates
-
ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్
ఉత్కంఠ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్ రైజర్స్ విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చతికిలపడింది. చివరి ఓవర్లో 13 పరుగులకు గాను 8 పరుగులు మాత్రమే చేసి ఓటమి మూటగట్టుకుంది. దీంతో సన్‌రైజర్స్ చివరి మ్యాచ్ విజయంతో ముగించినట్లయింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ..
ఆర్‌సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. దేవదత్ పాడికల్ 41 పరుగులకు ఔట్ అయ్యాడు. దీంతో 5 వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 113 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ 11 పరుగులు, షహబాద్ అహ్మద్ ఆట కొనసాగిస్తున్నారు. విజయానికి ఇంకా 16 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
100 పరుగులు దాటిన ఆర్‌సీబీ..
ఆర్‌సీబీ 16 ఓవర్లకు 100 పరుగులు దాటింది. విజయానికి ఇంకా 25 బంతుల్లో పరుగులు 39 చేయాల్సి ఉంది. క్రీజులో దేవదత్ పాడికల్ 38 పరుగులు, ఏబీ డివిలియర్స్ 4 పరుగుతో ఆట కొనసాగిస్తున్నారు.
-
15 ఓవర్లకు ఆర్‌సీబీ స్కోరు..98/4
ఆర్‌సీబీ 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 29 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో దేవదత్ పాడికల్ 36 పరుగులు, ఏబీ డివిలియర్స్ 1 పరుగుతో ఆట కొనసాగిస్తున్నారు. మరోవైపు సన్ రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ కాల్ 1 వికెట్ సాధించాడు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ..
ఆర్‌సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. గ్లెన్ మాక్స్‌వెల్ 40 పరుగులకు రనౌట్ అయ్యాడు. దీంతో 4 వికెట్ల నష్టానికి ఆర్‌సీబీ 92 పరుగులు చేసింది. దేవదత్ పాడికల్ 31 పరుగులు, ఏబీ డివిలియర్స్ ఆట కొనసాగిస్తున్నారు.
-
-
దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ బౌలర్లు.. 3 వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ను కంట్రోల్ చేస్తూనే వికెట్లు పడగొడుతున్నారు. మూడో వికెట్‌గా శ్రీకర్ భరత్‌ను పెవిలియన్‌కు పంపించారు. ప్రస్తుతం ఆర్‌సీబీ స్కోర్ 8 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
-
మరో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ.. డాన్ క్రియస్టియన్ ఔట్..
సన్‌రైజర్స్ బౌలర్లు మాంచి ఊపుమీదున్నారు. విరాట్‌ను ఔట్ చేసిన కాసేపటికే డాన్ క్రిస్టియన్‌ను ఔట్ చేశారు. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో క్రిస్టియన్ షాట్ కొట్టగా.. కేన్ విలియమ్సన్ క్యాచ్ పట్టాడు. 4 బంతులాడిన క్రిస్టియన్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్‌సీబీ స్కోర్ 19/2.
-
ఆర్‌సీబీకి ఆదిలోనే చుక్కెదురు.. కోహ్లీ ఔట్..
ఆర్‌సీబీకి ఆదిలోనే చుక్కెదురైంది. తొలి వికెట్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ స్కోర్ 1 వికెట్ నష్టానికి 12 పరుగులు.
-
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు కోహ్లీ సేన సిద్ధమైంది. ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పడిక్కల్ క్రీజ్‌లోకి వచ్చారు.
-
సన్ రైజర్స్ స్కోర్ 141.. బెంగళూరు లక్ష్యం 142…
అబుదాబీ వేదికగా ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో కేన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆర్‌సీబీకి 142 పరుగలు లక్ష్యాన్ని విదిల్చింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్‌హెచ్.. స్కోర్ 18 ఓవర్లుకు 130/6..
ఎస్ఆర్‌హెచ్ టీమ్ 6వ వికెట్‌ను కోల్పోయింది. హర్షద్ పటేల్ వేసిన బౌలింగ్‌లో వృద్ధిమాన్ సాహా క్యాచ్ ఔట్ అయ్యారు. 8 బంతులు ఆడిన వృద్ధిమాన్ ఒక ఫోర్‌తో 10 పరుగులు చేశాడు. ప్రస్తుతం 18 ఓవర్లు ముగియగా.. జట్టు స్కోర్ 130/6 గా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ ఉన్నారు.
-
మరో వికెట్ డౌన్.. ఐదవ వికెట్‌గా అబ్దుల్ సమద్.. స్కోర్-107/5
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇంతకు ముందే ఓపెనర్ జాసన్ రాయ్ ఔట్ అవగా.. కాసేపటికే అబ్దుల్ సమద్ పెవిలియన్ బాట పట్టాడు. యజువేంద్ర చాహల్ వేసిన బౌలింగ్‌లో అబ్దుల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. హైదరాబాద్ స్కోర్ 15 ఓవర్లకు 107/5.
-
సన్‌రైజర్స్‌కు మరో షాక్.. ఓపెనర్ జాసన్ రాయ్ ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయిన జట్టు.. ఇప్పుడు నాలుగో వికెట్ కోల్పోయింది. 4వ వికెట్‌కు ఓపెనర్ జాసన్ రాయ్ ఔట్ అయ్యాడు. డేన్ క్రిస్టియన్ వేసిన బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. జట్టు స్కోర్ పెంచడంతో మ్యాచ్ ప్రారంభం నుంచి తీవ్రంగా శ్రమించిన జానస్.. ఇంతకు ముందే క్యాచ్ ఔట్ అవగా.. డీఆర్ఎస్‌తో నాట్ ఔట్‌గా నిలిచాడు. కానీ, కాసేపటికే పెవిలియన్ బాట పట్టాడు. 38 బంతులాడిన జాసన్ రాయ్.. 44 పరుగులు చేశాడు. మొత్తం 5 ఫోర్లు బాదాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 107/4.
-
కష్టాల్లో సన్‌రైజర్స్.. ప్రియం గార్గ్ ఔట్.. స్కోర్-107/3
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో మునిగిపోయింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జాసన్ రాయ్‌కు తోడుగా సమర్థవంతంగా ఆడిన ప్రియం గార్గ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. డేన్ క్రిష్టియన్ వేసిన బౌలింగ్‌లో గార్గ్ షాట్‌కు ప్రయత్నించగా.. అది కాస్తా ఏబీ డెవిలియర్స్ చేతికి చిక్కింది. దాంతో గార్గ్ పెవిలియన్ బాట పట్టాడు. 11 బంతులు ఆడిన గార్గ్ ఒక సిక్స్ బాది 15 పరుగులు చేశాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోర్ 107/3.
-
2వ వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. విలియమ్సన్ ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2వ వికెట్‌ను కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 12వ ఓవర్ తొలిబంతికి విలియమ్సన్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ టీమ్.. 103 పరుగులు చేసింది.
-
విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్.. ఈసారి చాహల్‌తో..
నిలడగా రాణిస్తున్న సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించేందుకు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్ వేశాడు. చాహల్‌ను బౌలింగ్‌కు దింపాడు. ఇప్పటికే 8 ఓవర్లు పూర్తగా.. చాహల్ తొలి ఓవర్ వేశాడు. తాను వేసిన ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. 9 ఓవర్లకు సన్‌రైజర్స్ జట్టు స్కోర్ 66/1 గా ఉంది.
-
పవర్ ప్లే తరువాత సన్‌రైజర్స్ స్కోర్ – 50/1..
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ పవర్ ప్లే ముగిసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి ఎస్ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 50 పరగులు చేసింది. పవర్ ప్లే చివరి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ ఔట్ అవగా.. ప్రస్తుతం క్రీజ్‌లో జాసన్ రాయ్, కేన్ విలియమ్స్ ఉన్నారు.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 5 ఓవర్లకు 43/1..
అబుదాబీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అప్పుడే 5 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 5 ఓవర్లకు సన్‌రైజర్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది.
-
మొదటి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే తడబాటుకు గురైంది. రెండవ ఓవర్‌కే వికెట్ కోల్పోయింది. మొదటి రెండు బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో అభిమానుల్లో ఆశలు పెంచిన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు.
-
మాక్స్‌వెల్ టార్గెట్ రీచ్ అయ్యేనా.. రికార్డ్ సృష్టించేనా..
ఆర్‌సీబీ బ్యా్ట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇవాళ ఎస్ఆర్‌హెచ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో రాణించినట్లయితే.. 2,000 పరుగులను పూర్తి చేయనున్నారు. ఈ లక్ష్యం చేరడానికి అతను కేవలం 88 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. మాంచి ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ సాధించడం పెద్ద విషయం ఏమీ కాదంటున్నారు నిపుణులు. ఐపీఎల్‌లో మాక్స్‌వెల్ 11 అర్థసెంచరీలు చేశాడు.
-
మొత్తం ఐపీఎల్‌లో 20వ సారి తలపడుతున్న ఆర్‌సీబీ-ఎస్ఆర్‌హెచ్..
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్ హైదరాబాద్ జట్లు 19 సార్లు తలపడ్డాయి. ఇవాళ్టి మ్యాచ్‌తో ఆ సంఖ్య 20కి చేరింది. ఇంతకు ముందు జరిగిన 19 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 సార్లు గెలుపొందగా.. 8 మ్యాచ్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది.
-
లాస్ట్ 5 మ్యాచ్‌లలో ఏ జట్టు ఎక్కువగా గెలిచిందంటే..
అబుదాబి వేదికగా బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లలో తలపడగా.. బెంగళూరు 3 మ్యాచ్‌లలో గెలుపొందగా.. హైదరాబాద్ 2 మ్యాచ్‌లలో గెలిచింది. బెంగళూరు టీమ్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లోనూ హైదరాబాద్ విజయబావుటా ఎగురవేసింది. మరి ఈ మ్యాచ్‌లో గెలుస్తుందో.. ఓడుతుందో తెలియాలంటే మ్యాచ్ ఆసాంతం చూడాల్సిందే.
-
టాస్ గెలిచిన ఆర్‌సీబీ జట్టు.. బౌలింగ్ ఎంపిక..
ఆర్‌సీబీ జట్టు టాస్ గెలిచింది. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటగా బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లలోనూ ఎలాంటి మార్పులు జరుగలేదు. గల మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లే.. ఈ మ్యాచ్‌లోనూ ఉన్నారు.
Published On - Oct 06,2021 7:02 PM