ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా రిషబ్ పంత్ విశేషమైన ఫీట్ సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 100 అవుట్‌లు నమోదు చేసిన మూడో వికెట్ కీపర్‌గా నిలిచిన అతను 30 మ్యాచ్‌ల్లో 87 క్యాచ్‌లు, 13 స్టంపింగ్‌లు చేశాడు. ఈ ఘనతతో అతను అలెక్స్ కారీ, జాషువా డా సిల్వా వంటి ఆటగాళ్లతో ప్రత్యేక క్లబ్‌లో చేరాడు.
డిసెంబరు 2022లో రిషబ్ పంత్ రూర్కీ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతని కుడి మోకాలికి గాయంతో పాటు ఇతర గాయాలు తగిలాయి. ఈ పరిస్థితి కారణంగా అతను సంవత్సరంపాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల సమయస్ఫూర్తితో అతని పరిస్థితి మరింత దిగజారలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే రజత్, నిషు అతనిని కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి ధైర్య సాహసాలను గుర్తించిన రిషబ్ పంత్, వారికి కృతజ్ఞతగా స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు.
ఈ విషయాన్ని జర్నలిస్ట్ భరత్ సుందరేశన్ తన కథనంలో పంచుకున్నారు. సుందరేశన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై భావోద్వేగంతో స్పందిస్తూ పంత్ కృతజ్ఞతభావాన్ని ప్రశంసిస్తున్నారు.
The two people who saved Rishabh Pant's life after his accident had no idea who he was.@beastieboy07 travels back to India to retrace the steps from Pant's accident to his return, but also much more than that.
The tale of Rishabh's recovery, from those closest to him 🙏 pic.twitter.com/UuzaJBN0QT
— 7Cricket (@7Cricket) November 23, 2024