AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదెక్కడి విచిత్రం.. ఇలా కూడా క్లీన్ బౌల్డ్ అవుతారా.. క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి వీడియో చూసిండరు

WBBL 2024 Knockout Ruth Johnston Gets Out: మహిళల బిగ్ బాష్ లీగ్ 2024 మొదటి నాకౌట్ మ్యాచ్ సిడ్నీ థండర్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ ఓ విచిత్రమైన రీతిలో క్లీన్ బౌల్డ్ అయింది. షాట్ కొట్టిన 2 సెకన్ల తర్వాత ఈ ప్లేయర్ తన వికెట్ కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Video: ఇదెక్కడి విచిత్రం.. ఇలా కూడా క్లీన్ బౌల్డ్ అవుతారా.. క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి వీడియో చూసిండరు
Wbbl 2024 Knockout Ruth Johnston Gets Out
Venkata Chari
|

Updated on: Nov 27, 2024 | 4:33 PM

Share

WBBL 2024 Knockout Ruth Johnston Gets Out: మహిళల బిగ్ బాష్ లీగ్ 2024 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ సీజన్‌లో తొలి నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, హోబర్ట్ హరికేన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ షాట్‌ ఆడిన 2 సెకన్ల తర్వాత ఒక బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ కాకపోతే రనౌట్ అయ్యే ప్రమాదం ఉండేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షాట్ కొట్టిన 2 సెకన్ల తర్వాత క్లీన్ బౌల్డ్..

ఈ మ్యాచ్‌లో తొలుత హోబర్ట్ హరికేన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. కానీ, హోబర్ట్ హరికేన్స్ మూడో ఓవర్ లోనే తొలి వికెట్ కోల్పోయింది. రూత్ జాన్సన్ రూపంలో జట్టుకు తొలి దెబ్బ తగిలింది. షబ్నిమ్ ఇస్మాయిల్ చేతిలో రూత్ జాన్సన్ క్లీన్ బౌల్డ్ కాగా, జాన్సన్ క్లీన్ బౌల్డ్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి, హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో, షబ్నిమ్ ఇస్మాయిల్ మూడో ఓవర్ బౌలింగ్ చేసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన ఓవర్ నాలుగో బంతికి రూత్ జాన్సన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Weber WBBL (@wbbl)

రూత్ జాన్సన్ పుల్ షాట్ ఆడాలనుకుంది. కానీ, ఆ బంతి టాప్ ఎడ్జ్‌ను తీసుకుంది. అయితే, బంతి ఎత్తుకు వెళ్లకపోవడంతో రూత్ జాన్సన్ పరుగు తీసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత, షబ్నిమ్ ఇస్మాయిల్ ఆమెను రనౌట్ చేయడానికి పరిగెత్తింది. ఇంతలోనే పైకి వెళ్లిన బంతి వికెట్‌కు తగలడంతో రూత్ జాన్సన్ క్లీన్ బౌల్డ్ అయింది. రూత్ జాన్సన్ క్లీన్ బౌల్డ్ కాకపోతే, ఆమె రనౌట్ అయ్యేది. ఎందుకంటే బంతి వికెట్ దగ్గర ఉంది. షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా బంతికి చాలా దగ్గరగా వచ్చింది.

హోబర్ట్ హరికేన్స్ 126 పరుగులు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఈ సమయంలో, రూత్ జాన్సన్ 6 బంతులు మాత్రమే ఎదుర్కొని 5 పరుగులు చేసి ఔటైంది. ఈ ఇన్నింగ్స్‌లో ఆమె ఒక ఫోర్ కొట్టింది. అదే సమయంలో, కెప్టెన్ ఎలిస్ విల్లానీ తన జట్టు తరపున భారీ ఇన్నింగ్స్ ఆడింది. 42 బంతుల్లో 53 పరుగులు చేసింది. ఎలిస్ విల్లాని ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. వీరితో పాటు లిజెల్ లీ 23 పరుగులు, సుజీ బేట్స్ 17 పరుగులు చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..