
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ఐపీఎల్-2023 అంతగా కలసిరాలేదు. ప్లేఆఫ్‌కు కూడా చేరలేకపోవడంతో ౠ జట్టు ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ పడ్డారు. దీంతో టీం సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మేనేజ్‌మెంట్ జట్టులో కీలక మార్పు చేసేందుకు సిద్ధమైంది. బెంగాల్ వార్తాపత్రిక ‘సంగ్‌బాద్ ప్రతిదిన్’ నివేదిక ప్రకారం.. ఫ్రాంచైజీ ప్రధాన కోచ్ పదవి నుంచి ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్‌ను పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ పదవిలో సౌరవ్ గంగూలీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఈ సీజన్‌లో జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
పాంటింగ్ 2018 నుంచి జట్టుతో ఉన్నాడు. అతని హయాంలో జట్టు 2020లో తొలిసారి IPL ఫైనల్ ఆడింది. గత సీజన్ వరకు గంగూలీ ఢిల్లీ జట్టు డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజా మార్పులతో గంగూలీ కోచ్ పదవిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ టీం మిగతా జట్లకంటే చాలా బలహీనంగా పేరుగాంచింది. అయితే, రికీ పాంటింగ్ కోచ్ అయిన తర్వాత పరిస్థితులు మారాయి. ఢిల్లీ జట్టు చాలా కాలం తర్వాత 2019లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత 2021 వరకు ఈ జట్టు ప్లే ఆఫ్‌లను కొనసాగించింది. అయితే, ఢిల్లీ టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది. గత సీజన్ ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. IPL 2023లో ఢిల్లీ 14 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మాత్రమే గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచి, గుడ్ బై చెప్పింది.
ఐపీఎల్‌లో విజయవంతమైన కోచ్‌లలో పాంటింగ్ ఒకరు. 2015లో పాంటింగ్ కోచ్‌గా పనిచేసిన సందర్భంలోనే ముంబై ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత ఢిల్లీ బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గంగూలీ ఢిల్లీకి కోచ్‌గా మారితే జట్టును హ్యాండిల్ చేయడంలో ఇబ్బందులు ఉండవు. 2019-20లో జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత BCCI అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ కారణంగా ఢిల్లీ జట్టుతో తన సంబంధాలను తెంచుకోవాల్సి వచ్చింది. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత మరోసారి ఢిల్లీ జట్టులో చేరాడు. తాజాగా కోచ్ అవతారం ఎత్తేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..