
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లాండ్‌లు ఈ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. అయితే ఈ ఎనిమిది జట్లలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్ ఆడుతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. గత మూడు ఐసీసీ టోర్నీల్లో భారత్, ఆస్ట్రేలియాలు రెండుసార్లు ఫైనల్ ఆడాయి. ఈ రెండు జట్లు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, 2023 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ పోరు జరగవచ్చని పాంటింగ్ చెప్పాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మాదిరిగానే ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు తలపడడం దాదాపు ఖాయమని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఐసీసీ రివ్యూ షోలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీ స్ చేరతాయని అంచనా వేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనలిస్టులు భారత్-ఆస్ట్రేలియాలను దాటుకుని.. ఇతర జట్లు ఫైనల్ చేరడం కష్టమే అని అంచనా వేశాడు. పాకిస్థాన్ కూడా సెమీస్ చేరడం కష్టమే అని రవిశాస్త్రి అంచనా వేశాడు.
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. అందుకే ఈసారి కూడా వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన జట్లే టైటిల్ గెలుచుకునే ఫేవరెట్ జట్లుగా గుర్తింపు పొందాయి. దీని ప్రకారం వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ ఆడతాయో లేదో చూడాలి.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
Ravi Shastri Predicted 4 Semi Finalists for Champions Trophy which includes 3 teams from 1 Group and 1 from the Other Group
Group A: India
Group B: Aus, Eng, SA Africa
Harbhajan predicted 3 Semi Finalits from One group for CT 2025
Shastri joined the Elite List of Experts. 😂 pic.twitter.com/ZpI3saaorA— Barbarian (@Rashidcrea68271) February 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..