Richa Ghosh: ఒంటి చేత్తో క్యాచ్.. మరో ధోనీలా..

|

Oct 06, 2024 | 7:40 PM

దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన్ ఉమెన్స్ టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఓ అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుంది. వికెట్ల వెనుకు ఆ క్యాచ్‌ను పట్టుకుంది

Richa Ghosh: ఒంటి చేత్తో క్యాచ్.. మరో ధోనీలా..
Richa Ghosh
Follow us on

దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన్ ఉమెన్స్ టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఓ అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుంది. వికెట్ల వెనుకు ఆ క్యాచ్‌ను పట్టుకుంది. 14 ఓవర్లో స్పిన్నర్ ఆశ శోభన వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఫాతిమా సనా భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించగా.. బంతి స్పిన్ తిరగడంతో వెనకు వెళ్లింది. దీంతో వికెట్ల వెనుక ఉన్నా రిచా ఘోష్ బంతి ఒంటి చేత్తో అందుకుంది. రిచా బంతిని పట్టుకున్న సమయం కేవలం 0.44 మాత్రమే కావడం విశేషం. ఇలాంటి క్యాచ్లు పట్టుకోవడం ధోనీకే సాధ్యమవుతుంది. ఇప్పుడు రిచా కూడా ధోనీలా బంతిని ఒక్క చేత్తో ఒడిసి పట్టుకోవడాన్ని చూసిన నెటిజన్స్ ధోనీతో ఆమెను కంపేర్ చేస్తూ పొగుడుతున్నారు. ఉమెన్స్ క్రికెట్‌లో ఈ క్యాచ్ బెస్ట్ క్యాచ్ అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ కేవలం 105 పరుగుల మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లు శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు, అరుంధతి రెడ్డి 3 వికెట్లు తీసింది. శోభన, దీప్తి శర్మ, రేణుక ఠాకుర్‌లు ఒక్కో వికెట్ తీశారు. ఈ స్కోర్‌ను 18.5 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో ఛేదించి భారత్ విజయం సాధించింది.

రిచా ఘోష్ క్యాచ్ అందుకున్న వీడియో ఇదిగో:

పాకిస్థాన్ భారత టీ20 టీమ్:

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా(కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..