IPL 2025 Purse Remaining: రిటెన్షన్ తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలి ఉందంటే.. టాప్ టీం ఏదంటే?

|

Nov 01, 2024 | 7:05 AM

నవంబర్ చివరిలో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. రిటెన్షన్ జాబితకు గురువారం చివరి గడువు కావడంతో.. అన్ని జట్లు తమ రిటైన్ లిస్ట్‌‌ను విడుదల చేశాయి. ఇందులో SRH జట్టుకు చెందిన హెన్రిచ్‌ క్లాసెన్‌ (రూ.23 కోట్లు) అత్యధిక ధర పొందాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని RCB రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. రిటెన్షన్ తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలి ఉందంటే.. టాప్ టీం ఏదంటే?

IPL 2025 Purse Remaining: రిటెన్షన్ తర్వాత ఏ జట్టు వద్ద ఎంత పర్స్ మిగిలి ఉందంటే.. టాప్ టీం ఏదంటే?
Ipl 2024 Purse Remaining
Follow us on

మొత్తం పది ఫ్రాంచైజీలు గురువారం తమ జట్ల రిటైషన్ లిస్ట్ విడుదల చేశాయి. జట్లలో ఉంచిన మొత్తం 46 మంది ఆటగాళ్లలో, కేవలం రెండు ఫ్రాంచైజీలు  కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ – తమ గరిష్ట పరిమితి ఆరు రిటెన్షన్‌లను ఉపయోగించుకున్నాయి. పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను మాత్రమే ఉంచుకుంది. తద్వారా ఆ జట్టకు అతిపెద్ద బడ్జెట్‌ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. దీంతో మిగిలిన రూ. 41 కోట్ల పరిమిత బడ్జెట్‌తో వేలంలోకి ఆర్‌ఆర్ పాల్గొనబోతుంది.

 IPL జట్ల పర్సు ఇలా ఉంది:

చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 55 కోట్లు

ముంబై ఇండియన్స్ – రూ. 45 కోట్లు

కోల్ కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ – రూ. 41 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 45 కోట్లు

గుజరాత్ టైటాన్స్ – రూ. 69 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 83 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 73 కోటి

పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి