R Ashwin: అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ వెనక కారణాలేంటి? వారి ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నాడా?
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలో రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే టీమిండియా స్పిన్నర్ ఇలా తన క్రికెట్ కెరీర్ ముగించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల సిరీస్ కు ఎంపికైన అశ్విన్ కు తొలి మ్యాచ్ లో అవకాశం దక్కలేదు. ఇక అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్‌కు సీనియర్ స్పిన్నర్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన అశ్విన్.. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అశ్విన్ ఇఆకస్మిక రిటైర్మెంట్ పలు అనుమానాలకు దారితీసింది. టీమ్‌ఇండియాలో ఏదో జరుగుతోందంటూ కొందరు ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఎందుకంటే అశ్విన్ ఈ సిరీస్ ద్వారా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే, అతను సిరీస్ ప్రారంభానికి ముందే ప్రకటించేవాడు. అయితే సిరీస్ మధ్యలో ఆయన హఠాత్తుగా రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణమేంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు చెందిన పలువురు సినీయర్ ఆటగాళ్లు రిటైర్ అవుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో అశ్విన్ పేరు కూడా ఉంది. ఈ రూమర్లను నిజం చేస్తూ రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ సూచనల మేరకు సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకుంటుందని ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అలా రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌ను సిరీస్ మధ్యలోనే ముగించుకున్నాడని తెలుస్తోంది. అశ్విన్ బాటలోనే మరికొందరు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకోనున్నారన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సీనియర్ ఆటగాళ్లు కొనసాగుతున్నారు. వారిలో 37 ఏళ్ల రోహిత్ శర్మ అందరీ కన్నా పెద్దవాడు. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ డబ్ల్యూటీసీకి అర్హత సాధించకపోతే ఇదే అతనికి చివరి టెస్ట్ సిరీస్ అని తెలుస్తోంది.
ఇంటికి చేరుకున్న అశ్విన్..
HOME TOWN HERO IS BACK. 🇮🇳
– A Grand welcome for Ravichandran Ashwin at his home. 🤍#Ashwin pic.twitter.com/4Gb7YOFr3C
— INDIAN YOUTH (@Indian_Youth01) December 19, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..