ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతీ మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టు తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉంది. యూపీ వారియర్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు పేకమేడలా కుప్పకూలిపోయారు. 8 ఓవర్ల సమయానికి ఒకే ఒక్క వికెట్ నష్టానికి 72 పరుగులతో పటిష్టంగా కనిపించింది బెంగళూరు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక బెంగళూరు బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ (52: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసింది. అయితే టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన. కానీ జట్టుకు కోరుకున్న స్థాయిలో శుభారంభం లభించలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది.
కాగా, 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అలిస్సా హీలీ, దేవిక వైద్య జంట వికెట్ పడకుండా రాణిస్తున్నారు. 9 ఓవర్లు పూర్తయ్యే సమయానికి యూపీ జట్టు వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. ఈ క్రమంలో జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ(33 బంతుల్లో 66 పరుగులు; 14 ఫోర్లు)(21 బంతుల్లో 26 పరుగులు; 4 ఫోర్లు) వికెట్ నష్టపోకుండానే ఆర్‌సీబీ విసిరిన టార్గెట్‌ను ఛేదించేలా కనిపిస్తున్నారు.