LSG vs RCB: లక్నోతో పోరుకు బెంగళూరు సిద్ధం.. ప్లేయింగ్ 11 నుంచి కోహ్లీ ఔట్.?

RCB vs LSG Playing XI: ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయంతో జోరుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, బుధవారం ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్‌తో తలపడనుంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం, బౌలర్ రాసిఖ్ సలామ్ లభ్యతపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుత ఛాంపియన్ హోదాలో ఉన్న బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

LSG vs RCB: లక్నోతో పోరుకు బెంగళూరు సిద్ధం.. ప్లేయింగ్ 11 నుంచి కోహ్లీ ఔట్.?
Rcb Vs Lsg Playing Xi

Updated on: Apr 15, 2026 | 8:15 AM

RCB vs LSG Playing XI: ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫిలిప్ సాల్ట్ (36 బంతుల్లో 78), రజత్ పాటిదార్ (20 బంతుల్లో 53) వీరవిహారం చేయడంతో బెంగళూరు 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలర్లు కూడా రాణించడంతో 18 పరుగుల తేడాతో విజయం వరించింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో లక్నో గడ్డపై అడుగుపెడుతోంది. అయితే జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.

విరాట్ కోహ్లీ గాయంపై క్లారిటీ..

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించినప్పటికీ, అతను చీలమండ, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గత మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో లక్నోతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడా లేదా అన్నది అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే, కోహ్లీ కోలుకుంటున్నాడని, తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని రజత్ పాటిదార్ స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మిడిల్ ఆర్డర్, ఫినిషర్ల బలం..

ప్రస్తుతం బెంగళూరు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొడుతుండగా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఆఖర్లో పరుగుల వరద పారిస్తున్నారు. జితేష్ శర్మ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, కీలక సమయంలో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం అతనికి ఉంది. కృనాల్ పాండ్యా తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

బౌలింగ్ విభాగంలో మార్పులు..

రాసిఖ్ సలామ్ కాలి గాయంతో బాధపడుతుండటంతో అతని స్థానంలో యువ పేసర్ మంగేష్ యాదవ్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా, జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుయాష్ శర్మ తన స్పిన్ మాయాజాలంతో ముంబై వికెట్లను తీసిన తీరు జట్టుకు పెద్ద సానుకూలాంశం.

లక్నోతో తలపడే బెంగళూరు తుది జట్టు (అంచనా):

విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.

ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశాలు: మంగేష్ యాదవ్, వెంకటేష్ అయ్యర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us