IPL 2024: వామ్మో, ఇదేందిది.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే.. ఆర్‌సీబీ దెబ్బకు సరికొత్త చరిత్ర

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Records: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ , ఫాఫ్ డు ప్లెసిస్ జోడీ జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 29 బంతుల్లో 47 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. ఔటైన తర్వాత కూడా డు ప్లెసిస్ (54) తన మంచి ఇన్నింగ్స్‌ను కొనసాగించి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

IPL 2024: వామ్మో, ఇదేందిది.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే.. ఆర్‌సీబీ దెబ్బకు సరికొత్త చరిత్ర
Rcb Vs Csk Result

Updated on: May 19, 2024 | 8:10 AM

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్‌లో 68వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 218/5 స్కోరు చేసింది. అనంతరం చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. కాగా, ఈ సీజన్‌లో RCB తన పేరిట మరో పెద్ద రికార్డును సృష్టించింది. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా RCB నిలిచింది.

ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో RCB అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ మొత్తం 16 సిక్సర్లు కొట్టింది. ఈ సీజన్‌లో RCB ఇప్పుడు 157 సిక్సర్లు కొట్టింది. 150 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన మొదటి జట్టుగా కూడా నిలిచింది. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 146 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది.

ఈ ఐపీఎల్ సీజన్ చాలా రకాలుగా ప్రత్యేకమైనది. ఈ సీజన్‌లో, అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా నమోదైంది. మొత్తం 200 కంటే ఎక్కువ సిక్సర్ల రికార్డు కూడా సృష్టించారు.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ జట్లు విభిన్న ఉద్దేశాలతో ఆడగా, ఈ జట్ల బ్యాట్స్‌మెన్స్ ప్రత్యర్థి జట్ల బౌలర్లపై కనికరం చూపలేదు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ , ఫాఫ్ డు ప్లెసిస్ జోడీ జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించింది. 29 బంతుల్లో 47 పరుగులు చేసి కోహ్లీ అవుటయ్యాడు. ఔటైన తర్వాత కూడా డు ప్లెసిస్ (54) తన మంచి ఇన్నింగ్స్‌ను కొనసాగించి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

డుప్లెసిస్ పెవిలియన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, రజత్ పాటిదార్ బాధ్యతలు స్వీకరించి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కామెరాన్ గ్రీన్ కూడా 38 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం చెన్నై జట్టు తరపున జట్టులో రచిన్‌ రవీంద్ర (37 బంతుల్లో 61 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా, రవీంద్ర జడేజా (42 నాటౌట్), అజింక్య రహానె ( 22 బంతుల్లో33 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోనీ (25) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..