కప్పు గెలిచిన ఆనందంలో ఉన్న RCBకి బిగ్ షాక్..! ఫ్యాన్స్ ఊరుకుంటారా.?
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ టీమ్‌కు, అభిమానులకు పెద్ద షాక్. బెంగళూరులో విజయోత్సవ పరేడ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలోనే సెలేబ్రేషన్స్. ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలని సూచించారు.

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంతోషంలో మునిగి తేలుతున్న ఆర్సీబీ టీమ్‌కు, వారి అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. తొలి ఐపీఎల్ కప్పు గెలిచిన టీమ్‌తో బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ భావించింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు విక్టరీ పరేడ్, 6 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. కానీ, బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించడంతో విక్టరీ పరేడ్ రద్దు అయింది. మరి ఈ బ్యాడ్ న్యూస్ విని ఆర్సీబీ అభిమానులు ఎలా రియార్ట్ అవుతానేది ఆందోళనకరంగా మారింది. ఓపెన్ టాప్ బస్‌లో విరాట్ కోహ్లీ, ఇతర ఆర్సీబీ ఆటగాళ్లు, ఐపీఎల్ ట్రోఫీతో విక్టరీ పరేడ్‌లో పాల్గొంటే.. అభిమానులు లక్షలల సంఖ్యలో బెంగళూరు నగరంలో గుమ్మిగూడే అవకాశం ఉంది.
ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న బెంగళూరు సిటీకి ఈ విక్టరీ పరేడ్ తీవ్ర అంతరాయం కలిగిస్తుందని భావించి, విక్టరీ పరేడ్‌కు అనుమతి నిరాకరించినట్లుగా సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం విక్టరీ పరేడ్ మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధలో ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియం చేరుకుంటుంది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ నిర్వహించాలి అనుకున్నారు. కానీ, ఇప్పుడు కేవలం స్టేడియంలో సెలబ్రేషన్స్‌కు మాత్రమే ఆర్సీబీ పరిమితం కానుంది. అంతేకాకుండా స్టేడియంలోకి ప్రవేశం పరిమితం చేశారు. టికెట్, పాస్ ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతేకాకుండా స్టేడియంలో పరిమిత పార్కింగ్ స్థలం ఉన్నందున, ప్రజలు మెట్రో, ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలని అధికారులు సూచించారు. బెంగళూరులోని CBD ప్రాంతం వైపు మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వెళ్లకపోవడం మంచిదని సాధారణ ప్రజలకు సూచించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




