IPL 2021: ‘ఈ సాలా కప్ నమదే’ నిజం చేస్తారనుకుంటే.. ఇలా అయిందేనట్రా.! నెట్టింట్లో పేలుతున్న జోకులు..

|

May 04, 2021 | 4:40 PM

IPL 2021: కరోనా కారణంగా ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు...

IPL 2021: ఈ సాలా కప్ నమదే నిజం చేస్తారనుకుంటే.. ఇలా అయిందేనట్రా.! నెట్టింట్లో పేలుతున్న జోకులు..
Rcb (1)
Follow us on

IPL 2021: కరోనా కారణంగా ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు క్రికెటర్లకు, కోచింగ్ స్టాఫ్, గ్రౌండ్ మెన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు కోవిడ్ బారిన పడటంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనితో క్రికెట్ ప్రేమికులు నిరాశకు గురైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఫన్నీ మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల ఫ్యాన్స్ సెటైరికల్ పోస్టులతో హల్చల్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ఒక్క సీజన్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ విజేత కాలేకపోయినా.. ఈ సీజన్‌లో దుమ్ము లేపుతోంది. ఈసారి టైటిల్ గెలిచే అవకాశం ఉందని అనుకునేలోపే టోర్నీ వాయిదా పడిందని.. ఆర్సీబీకి ఇది గట్టి దెబ్బ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ సాలా కప్ నమదే’ నిజం చేస్తారనుకుంటే.. ఇలా అయిందేనట్రా.! అంటూ కోహ్లీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అటు ఐపీఎల్ వాయిదా పడటంతో సన్ రైజర్స్ సీఈవో కావ్య మారన్ తెగ సంతోషపడతారని జోకులు పేలుస్తున్నారు. ఇంకొందరు అయితే వార్నర్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. ఇలా ఐపీఎల్ వాయిదా పడటంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వర్షం కురుస్తోంది.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!