AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశే.. టాప్-3కి చేరుకోవడం కష్టమే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..

RCB: ఐపీఎల్ ప్రతి సీజన్‌ ప్రారంభానికి ముందునుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హంగామా మొదలవుతుంది. ప్రతీసారి తమ అభిమాన జట్టు IPL టైటిల్ గెలుస్తుందని ఆశిస్తూనే ఉన్నారు.

IPL 2023: విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశే.. టాప్-3కి చేరుకోవడం కష్టమే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
Rcb Ipl 2023
Venkata Chari
|

Updated on: Mar 24, 2023 | 7:30 AM

Share

ఐపీఎల్ ప్రతి సీజన్‌ ప్రారంభానికి ముందునుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల హంగామా మొదలవుతుంది. ప్రతీసారి తమ అభిమాన జట్టు IPL టైటిల్ గెలుస్తుందని ఆశిస్తూనే ఉన్నారు. అయితే గత 15 ఏళ్లలో ఇది జరగలేదు. అదే సమయంలో ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆర్‌సీబీ గురించి భారీ అంచనాలు వేశారు. ఆకాష్ చోప్రా టాప్-3లోకి రాకపోవచ్చని అన్నారు.

‘టాప్-3లో ఉండదు’

RCB గురించి భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాట్లాడుతూ “ఈ జట్టు అర్హత సాధించాలి. కానీ వారు స్వదేశంలో ఆడటం ప్రారంభించినప్పుడు బెంగళూరు సమస్య వస్తుంది. వారు సహజ వేదికలపై ఆడినప్పుడు ఆర్‌సీబీ గొప్ప జట్టు. ఇది వేరే రకమైన సవాలు అవుతుంది. వారు టాప్‌లో ఉండొచ్చు. కానీ, నాలుగు, ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వగలరు. టాప్-3లోకి రాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

బౌలర్లే కీలకం..

RCB బౌలర్ల గురించి మాట్లాడితే, “మీరు ఎక్కడికి వెళ్లాలో బౌలర్లు మాత్రమే నిర్ణయించగలరు. ముఖ్యంగా సొంత మైదానంలో ఆడుతున్నప్పుడు వానిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్ లభ్యత ఉండాలి. కానీ ఇప్పుడు అది ప్రశ్నార్థకరంగా మారింది’ అంటూ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు ఆడుతున్న సమయంలో హాజిల్‌వుడ్ గాయపడ్డాడు. దీంతో భారత్‌తో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ లేకుండా ఆర్సీబీ జట్టు బౌలింగ్ బలహీనంగా ఉంటుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

భారత మాజీ కెప్టెన్ మాట్లాడుతూ “అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాకు ఆడటం లేదు. కాబట్టి ఆదిలోనే వీరు అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేకుంటే, విదేశీ ఫాస్ట్ బౌలర్ల జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇటీవలే జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ముంబైకి పంపారు’ అంటూ అభిప్రాయపడ్డాడు.

“రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, హర్షల్ పటేల్‌లతోపాటు కరణ్ శర్మ, ఆకాష్‌దీప్ కూడా ఉన్నారు. వీరిలో అద్భుతంగా రాణించే ఆటగాళ్లు కూడా ఉన్నారు. బౌలింగ్ బాగా కనిపిస్తోంది. కానీ, జోష్ హేజిల్‌వుడ్ లేకపోతే అది జట్టును చాలా బలహీనపరుస్తుంది. ఎందుకంటే డేవిడ్ విల్లీ ఈ పని చేయలేడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...